రివ్యూ: ఫిదా – ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టొరీ!

కథ :
అమెరికాలో డాక్టర్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్).. అన్న రాజా, తమ్ముడు బుజ్జితో కలిసి ఉంటుంటాడు. తల్లీ తండ్రి లేకపోవటంతో వరుణ్, బుజ్జిలే రాజాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఉండే రేణుక (శరణ్య ప్రదీప్) అనే అమ్మాయితో రాజా పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన వరుణ్, పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. భానుమతికి కూడా వరుణ్ అంటే ఇష్టం కలుగుతుంది.

కానీ తన తండ్రిని వదిలి వెళ్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో వరుణ్ తన మామయ్య కూతురు శైలుతో క్లోజ్ గా ఉండటం చూసి మరింతగా దూరమవుతుంది. రాజా పెళ్లి తరువాత అన్నా వదినలతో కలిసి అమెరికా వెల్లినా వరుణ్, భానుమతిని మర్చిపోలేకపోతాడు. చివరకు భానుమతికి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ భానుమతి వరుణ్ కి నో చెపుతుంది. తరువాత వరుణ్, భానుమతి మనసు ఎలా గెలుచుకున్నాడు..? తండ్రి వదిలి వెల్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ తో పెళ్లికి ఒప్పుకుందా..? అన్నదే మిగతా కథ

ప్లస్ పాయింట్స్ :

సినిమా పోజిటివ్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి. తన పెర్ఫార్మెన్స్ తో థియేటర్ లో అందరిని కట్టిపడేసింది. ప్రతి చిన్న ఎమోషన్స్ కి కూడా అద్బుతంగా చూపిస్తూనే, కుటుంబం ,ప్రేమ అనే బంధాల మధ్య నలిగిపోయే ఓ మామూలు అమ్మాయి పాత్రలో ఆ సంఘర్షణని భాగా చూపించింది. ఇక ఆమె కామెడీ టైమింగ్, తెలంగాణా యాసలో ఆమె సంభాషణలు పలికే విధానం. డాన్స్ ఇలా అన్నింటా టాప్ అనిపించుకొని సినిమా రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఇక సినిమా ఆద్యంతం ప్రేక్షకులని అలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. అచ్చం మన ఇంట్లో, మన ఊరిలో ఉన్న ఫీలింగ్ ని ఫస్ట్ ఆఫ్ అంతా ఉంటుంది.

ఇక నటీనటుల విషయంకి వస్తే ఈ సినిమాకి మేజర్ ప్లస్ సాయి పల్లవి. వరుణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో అతని పెర్ఫార్మెన్స్ విషయంలో కాస్తా వంకలు పెట్టేవారు. ఈ సినిమాలో అతను తన యాక్టింగ్ టాలెంట్ పీక్ లో చూపించాడు. ఇక హీరోయిన్ తండ్రిగా చాలా ఏళ్ల తర్వాత నటించిన సీనియర్ నటుడు సాయిచంద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా వారి పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మైనస్ పాయింట్స్ అంటే ముందుగా సినిమాలో చెప్పుకోవడానికి అసలు కథ లేకపోవడం. శేఖర్ కమ్ముల అన్ని సినిమాల తరహాలోనే ఇందులో కూడా ఇలాంటి కథ ఉండదు. కేవలం చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ సన్నివేశాలు, భావోద్వేగాలతో కథని నడిపించారు. ఇక మొదటి సగ భాగం చూసిన తర్వాత రెండో సగ భాగంలో ఆడియన్స్ ఇంకాస్తా ఎక్కువ ఊహిస్తాడు. అయితే సెకండ్ హాఫ్ ఆడియన్స్ అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. లవ్ స్టొరీ, ఎంటర్ టైన్మెంట్ మొత్తం ఫస్ట్ హాఫ్ కి పరిమితం అయిపోవడంతో సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఫైనల్ గా హీరో తన ప్రేమని సొంత చేసుకునే విధానం అంత కన్విన్సింగ్ గా లేనట్లు అనిపిస్తుంది. అలాగే సినిమాలో మెయిన్ కాస్టింగ్ తప్ప మిగిలిన వారిలో చాలా మంది కొత్త మొహాలు కనిపించడం కాస్తా రెగ్యులర్ ఆడియన్స్ కి ఇబ్బందిగ అనిపించిన, శేఖర్ కమ్ముల సినిమాలు ఫాలో అయ్యేవారికి ఒకే.

విడుదల తేదీ : జూలై 21, 2017

 రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : శేఖర్ కమ్ముల

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : శక్తి కాంత్

నటీనటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *