హుజూర్ నగర్ ఉప ఎన్నిక..

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక… ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలను కుదిపే స్తోంది. అధికార, ప్రతిపక్షాలకు అసలైన పరీక్షగా మారింది. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకుంటున్నాయి. హుజూర్‌నగర్‌లో గెలవడం ద్వారా ప్రజామోదం తమకే ఉందని చెప్పడంతోపాటు తమ పాలనపై విపక్షాల ఆరోపణలన్నింటికీ చెక్‌ పెట్టాలనే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ ఉంది. మరోవైపు సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో బలపడ దామనుకుంటున్న బీజేపీని వెనక్కు నెట్ట వచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈనేపథ్యంలో భవిష్యత్‌ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనా నడుమ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *