ముకేశ్‌ అంబానీ ఇంట్లో అగ్ని ప్రమాదం…వీడియో

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ నివసించే అంటిలియా భవనంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆల్టామౌంట్‌ రోడ్డులోని 27 అంతస్తుల ఈ ఇంట్లో ఆరో ఫ్లోర్‌లో రాత్రి 9గంటలకు మంటలు లేచాయి. ఈ సమాచారం అందిన వెంటనే 6 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు
ఇటీవలే ముఖేశ్ అంబానీ విలాసవంతమైన భవనాన్ని ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనంగా పేర్కొంది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ 12వేల 500 వందల కోట్లు. ఆరు అంతస్థుల ఈ భవనానికి పార్కింగ్, గ్యారేజీ కోసమే నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఈ భవనంలోని బాల్‌రూమ్ పైకప్పును అత్యంత ఖరీదైన వజ్రాలతో అలంకరించారు. దీనిలో ఒక థియేటర్‌తోపాటు మూడు హెలీపాడ్ లున్నాయి. సుమారు 600 మంది సిబ్బంది ఈ భవనాన్ని పర్యవేక్షిస్తుంటారు. భవనంలో శ్రీకృష్ణ మందిరం, లైబ్రెరీ ఉన్నాయి. అలాగే హెల్త్ క్లబ్, గెస్ట్ హౌస్, జిమ్, స్టూడియో సౌకర్యాలున్నాయి. ముఖేశ్ అంబానీ దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. అయితే ఎన్ని కార్లు ఉన్నాయని తెలియనప్పటికీ, వీటి పార్కింగ్‌కు ఆరో అంతస్థు మొత్తాన్ని కేటాయించారు. ముఖేశ్ దగ్గర మూడు ప్రైవేట్ జెట్ ప్లెయిన్లున్నాయి.
కాగా గతంలో ఈ భవనానికి వాస్తు దోషాలున్నాయని పండితులు ముఖేష్ అంబానీకి చెప్పారు. దీంతో ఆయన భవనంలో పలు మార్పులు, చేర్పులు చేయించి గృహ ప్రవేశం చేశారు. తాజాగా భవనంలో అగ్ని ప్రమాదం జరగడానికి కూడా వాస్తు దోషమే కారణమై ఉండవచ్చని  పండితులు పేర్కొటున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *