ఫస్ట్ లుక్: పవన్ అజ్ఞాతవాసి విడుదల !

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా వస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’ అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా పై భారి అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల అయ్యింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తోంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మెడలో ఐడి కార్డు తో డీసెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు పవన్. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

pawan-kalyan-agnathavasi-first-look-out

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *