ఫ్లిప్‌కార్ట్‌లో పాత వస్తువులు, పాత వస్తువులకు 3–12 నెలల వారంటీ…

 భారత అతి పెద్ద ఈ–కామర్స్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌… మరమ్మతు చేసి, బాగు చేసిన (రిఫర్బిష్‌డ్‌) వస్తువుల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. చిన్న చిన్న లోపాల కారణంగా పనికి రాకుండా పోయిన పాత వస్తువులను రిపేర్లు చేసి మళ్లీ వినియోగానికి పనికివచ్చేలా చేయడాన్ని రిఫర్బిష్‌డ్‌గా వ్యవహరిస్తారు.

ఇలాంటి వస్తువుల కోసం తొలిసారిగా ఈ 2గుడ్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై తొలిసారిగా స్మార్ట్‌ఫోన్లను, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కేటగిరీ వస్తువులను అందిస్తామని చెప్పారాయన.

అదే సమయంలో ఈ వస్తువుల నాణ్యతపై ఉండే అపనమ్మకాలు, వెసులుబాటు సమస్యలకూ పరిష్కారం చూపుతున్నాం’ అన్నారు. ప్రస్తుతం మొబైల్‌ వెబ్‌ ద్వారానే ఈ వస్తువులను బుక్‌ చేసుకోవాలి. మున్ముందు డెస్క్‌టాప్‌, మొబైల్‌ యాప్‌ ద్వారానూ 2గుడ్‌ రీఫర్బిష్డ్‌ వస్తువులు బుక్‌ చేసుకోవచ్చు. ఈ వేదిక ద్వారా దేశీయ ఇ-కామర్స్‌ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని ఫ్లిప్‌కార్ట్‌ భావిస్తోంది. రీఫర్బిష్డ్‌ వస్తువులకు 3 నుంచి 12 నెలల వారెంటీ లభిస్తుంది. ఇంకా ఈ వస్తువుల సర్వీసింగ్‌ కోసం దేశవ్యాప్తంగా సర్వీస్‌ కేంద్రాలూ ఉంటాయని కృష్ణమూర్తి చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *