యూఎస్ బాక్సాఫీస్ గరుడవేగానిదే!

పీఎస్వీ గరుడవేగ.. ఈ వారం సంచలనం అనాల్సిందే. ప్రస్తుతం రాజశేఖర్ కు పెద్దగా మార్కెట్ లేదు. తను ఇతర వేషాలకు మారిపోక తప్పదని రాజశేఖర్ కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయిన పరిస్థితులలో వచ్చిన మూవీ గరుడవేగ. టీజర్.. ట్రైలర్ లతో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం.. స్థానికంగానే కాదు.. యూఎస్ లో కూడా అదరగొడుతోంది.

గతవారం వచ్చిన సినిమాలలో హారర్ కామెడీ జోనర్ లోని మూవీ నెక్ట్స్ నువ్వే. ఈ చిత్రం వారాంతం అంతా కలిపి 20వేల డాలర్లను కూడా రాబట్టలేకపోయింది. రాజుగారి గది2 తర్వాత వచ్చిన ఈ హారర్ కామెడీ సినిమా.. సరైన కంటెంట్ లేకపోతే హారర్ కామెడీలకు దాదాపుగా కాలం చెల్లినట్లే అనే ఫీలింగ్ ను కలుగ చేసింది. ఇక హెబ్బా పటేల్ ఏంజెల్ మూవీ పరిస్థితి అయితే మరీ దారుణం. 200 డాలర్లు కలెక్షన్స్ వచ్చాయంటే సిట్యుయేషన్ అర్ధమవుతుంది. కానీ రాజశేఖర్ గరుడవేగ మూవీకి మాత్రం అద్భుతమైన పికప్ లభించింది. గురువారం నాడు ప్రీమియర్లతో 28వేల డాలర్లు రాబట్టగా.. శుక్రవారం నాడు 64వేల డాలర్లకు వసూళ్లు పెరిగాయి.

శనివారం నాడు అయితే ఏకంగా 106వేల డాలర్లు రావడం విశేషం. సండే కూడా జోరు చూపించిన ఈ చిత్రం 60వేల డాలర్లను రాబట్టి.. మొత్తంగా వసూళ్లను 2.62 లక్షల డాలర్లకు పెంచుకుంది. ఇప్పటికే దాదాపుగా పెట్టుబడి రికవర్ చేసేయగా.. ఇకపై కూడా కొన్ని రోజుల పాటు జోరు చూపించి.. లాభాలను పంచడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం ఆఫర్స్ ను పక్కాగా ఉపయోగించుకునే అవకాశం గరుడవేగకు దక్కింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *