భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న ‘గరుడవేగ’ !

సీనియర్ హీరో డా.రాజశేఖర్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న విజయం ఎట్టకేలకు ‘పిఎస్వి గరుడవేగ’ రూపంలో ఆయనకు దక్కింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం రాజశేఖర్ కు మర్చిపోలేని విజయాన్ని అందించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది. హాలీవుడ్ స్థాయి మేకింగ్, ఎన్.ఐ.ఏ అధికారిగా నటన సినిమాను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేశాయి.

విడుదలైన మొదటి రోజు సాయంత్రానికి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం 10 రోజులకు గాను రూ.22 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ విజయంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు భారీ ఆఫర్లు వస్తుండగా రాజశేఖర్ రెట్టించిన ఉత్సాహంతో తదుపరి ప్రాజెక్ట్ బు సెట్ చేసుకునే పనిలో ఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *