భారీగా పెరిగిన బంగారం ధర . ఒక్కరోజే రూ.990 పెరిగిన పసిడి

డాలర్‌ విలువ 2015 నాటి కనిష్ట స్థాయిలకు పడిపోవడం, ఉత్తర కొరియా, అమెరికాల మధ్య టెన్షన్‌ వాతావావరణంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 990 రూపాయల మేర పెరిగి 31వేలకు పైన 31,350 రూపాయలుగా నమోదైంది. ఇది 10 నెలల గరిష్టం. మెటల్‌ సైతం ఈ ఏడాదిలో అతిపెద్ద గరిష్ట స్థాయిలను నమోదుచేసింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి ఎక్కువగా డిమాండ్‌ రావడంతో వెండి ఒక్కో కేజీ రూ.42వేలకు పెరిగింది. డాలర్‌ విలువ పతనం కావడంతో, బంగారం గ్లోబల్‌ మార్కెట్లలో ఏడాది గరిష్టానికి ఎగిసిందని, దీంతో దేశీయ మార్కెట్‌లో సెంటిమెంట్‌ బలపడిందని బులియన్‌ ట్రేడర్లు చెప్పారు.
హారికేన్‌ ఇర్మా అమెరికాపై భారీగా ప్రభావం చూపింది. అంతేకాక అంచనావేసిన దానికంటే బలహీనంగా ఉద్యోగ డేటా విడుదలైంది. ఇవన్నీ డాలర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో బంగారం భారీగా ఎగిసింది. గ్లోబల్‌గా బంగారం ధరలు 0.31 శాతం పెరిగి, 2016 సెప్టెంబర్‌ నాటి గరిష్టంలో ఒక్కో ఔన్స్‌కు 1,352.80 డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్‌ కూడా 0.19 శాతం పెరిగి 18.13 డాలర్లుగా రికార్డు అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో 99.9, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు 990 రూపాయల చొప్పున 31,350 రూపాయలుగా, 31,200 రూపాయలుగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేర ధరలు 2016 నవంబర్‌లో నమోదయ్యాయి.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *