గూగుల్ లో 3వేల కొత్త ఉద్యోగాలు

అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ సెంట్రల్ లండన్‌లో తన క్యాంపస్‌ను భారీగా విస్తరించనున్నట్టు నిర్థారించింది. ఈ విస్తరణలో భాగంగా కొత్తగా మూడు వేల ఉద్యోగాలను గూగుల్ కల్పించనున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. లండన్స్ కింగ్స్  క్రాస్ ట్రైన్ స్టేషన్‌కు వెనుకవైపు ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న కాంప్లెక్స్‌లో ఓ కొత్త ఆఫీసు బిల్డింగ్‌ను నిర్మించనున్నట్టు గూగుల్ వెల్లడించింది. ఇది అమెరికాకు వెలుపల నిర్మిస్తున్న కంపెనీ సొంతం బిల్డింగ్‌లో మొదటిది. యూకేలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వారికి ఉన్నతమైన భవిష్యత్తు ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. యూకేలోని తమ కొత్త కింగ్స్ క్రాస్ క్యాంపస్‌లో పెట్టుబడులు పరంపర కొనసాగిస్తామని చెప్పారు. కొత్తగా యూకేలో పెడుతున్న పెట్టుబడులతో దాదాపు 3వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని సంబంధిత వర్గాలు అంచనావేస్తున్నాయి.
పది అంతస్థుల భవనాన్ని బ్రిటిష్ క్యాపిటల్‌లో నిర్మించే యోచనలో ఉన్నామని గూగుల్ ఇంతకముందే ప్రకటించింది. ఈ కొత్త బిల్డింగ్‌ను 2018లో ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ కొత్త ఆఫీసు బిల్డింగ్ ప్రారంభంతో అక్కడ మొత్తం స్టాఫ్  7వేల మందికి పెరుగనున్నారు. గూగుల్ ప్రకటనను బ్రిటన్ ఆర్థికమంత్రి ఫిలిప్ హంమొండ్ స్వాగతించారు. భవిష్యత్తులో దేశ ఆర్థికవృద్ధికి తమ టెక్నాలజీ ఇండస్ట్రి రక్షణగా ఉండనుందని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాల ప్రారంభానికి బ్రిటన్ ఎల్లవేళలా తలుపులు తెరిచి ఉంటుందనే సంకేతానికి ఇది ఒక ప్రూఫ్ అని వెల్లడించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్న అనంతరం ప్రభుత్వం భరోసాతో లండన్‌లో పెట్టుబడులకు గూగుల్ సిద్దమైంది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *