ఫస్ట్ లుక్: జయ సింహతో కన్నడ బ్యూటి

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం జై సింహా.. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. 2018 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే జైసింహా షూటింగ్ ఫినిషింగ్ స్థాయికి వచ్చేయగా.. ఈ చిత్రంలో తన పార్ట్ షూట్ పూర్తయిపోయిందని చెబుతూ.. బాలయ్యతో తన ఫస్ట్ లుక్ ను అనఫీషియల్ గా రిలీజ్ చేసేసింది హరిప్రియ.

కన్నడ బ్యూటీ అయిన హరిప్రియ.. నందమూరి బాలకృష్ణతో తొలిసారి జోడీ కట్టిన చిత్రం జై సింహా. అలాగని సినిమా పోస్టర్ ఏమీ రిలీజ్ చేయలేదు కానీ.. షూటింగ్ తొలి షెడ్యూల్ లో బాలయ్యతో కలిసి తను దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది హరి ప్రియ. ‘నేను జైసింహా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసినప్పటి ఫోటో ఇది. డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. అంతే కాదు.. ఎంతో పరిజ్ఞానం కలిగిన బాలకృష్ణ గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీంను ఇప్పటికే మిస్ అవుతున్నాను’ అంటూ ట్వీట్ చేసిన హరిప్రియ.. షూటింగ్ స్పాట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

గతంలో ఈ భామ తకిట తకిట.. పిల్ల జమిందార్.. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్.. ఈ వర్షం సాక్షిగా వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చేసి.. కన్నడలో మంచి పేరుతో పాటు ఇమేజ్ కూడా సంపాదించేసుకుంది. ఇప్పుడీ వయ్యారి చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉండగా.. మరో 4 ప్రాజెక్టులు అంగీకరించాల్సి ఉందంటే.. హరిప్రియ స్పీడ్ అర్ధమవుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *