కులం వివాదంపై స్పందించిన హరీష్ శంకర్

దువ్వాడ జగన్నాథం చిత్రంలోని గుడిలో బడిలో మడిలో అనే సాంగ్ రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.ముందుగా ప్రవర చెప్పి పరిచయం చేసుకున్న హరీష్ శంకర్.. ‘ఇప్పటికే నేను బ్రాహ్మణ అబ్బాయిని అని మీకు అర్ధమైఉంటుంది. ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఉన్నా కనీసం గుడ్డు కూడా తినని పదహారు అణాల బ్రాహ్మణుడిని నేను.

ప్రవర ఇపుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ పాటలో ప్రవర అనే పదం కూడా వాడాము. ప్రవర అనేది రుషి వంశంలో పుట్టిన వారు తమను తాము పరిచయం చేసుకునేందుకు చెప్పేది.” అని హరీష్ తెలిపారు. పాటలో అగ్రహారంలో తమలపాకల్లె తాకుతోంది తమకం అనే వాక్యానికి అభ్యంతరం చెబుతున్నారు. ఇందులో తప్పేమీ లేదు. తన ప్రేమను చెప్పేందుకు చుట్టూరా ఉన్న వస్తువులతో పోల్చి చెప్పడం ఆనవాయితీ. ప్రేమలో పడ్డాక పుస్తకం పట్టుకోవాలని అనిపించడం లేదని అన్నంత మాత్రాన సరస్వతీ దేవిని అవమానించినట్లు కాదు.

నాకు ఏ సామాజిక వర్గం మీద కోపం లేదు. దిల్ రాజు గారు నిజామాబాద్ లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. సంవత్సరానికి 10 రోజులు బ్రహ్మోత్సవాల పేరు మీద కంప్లీట్ నాన్ వెజ్ మానేసి పట్టుబట్టలు కట్టుకుని ఉదయం 4 గంటల నుండి 11 గంటల వరకు గుడిలోనే గడుపుతారు. ఒక్క బ్రాహ్మణిజం మీద మాత్రమే కాదు… హిందూ మతం మీద అంత గౌరవం ఉన్న నిర్మాత దిల్ రాజు… అని హరీష్ శంకర్ అన్నారు.

మరి అలాంటి నిర్మాత 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాతో ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు కించపరుస్తాడు. అసలు ఇప్పుడు వస్తున్న ఈ తప్పుడు ఆరోపణలకి తగిన సమాధానం త్వరలోనే ఇస్తానని హరీష్ శంకర్ అన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *