హైదరాబాద్‌లో భారీ వర్షం

నగరంలో పలుచోట్ల బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. బేగంబజార్‌, తాజ్‌ ఐలాండ్‌, ఓల్డ్‌ పీసీఆర్‌, మూసారాంబాగ్‌, ఎంజే మార్కెట్‌, మలక్‌పేట రైల్వే బ్రిడ్జి, మలక్‌పేట గంజ్‌, నల్గొండ క్రాస్‌ రోడ్స్‌, అంబర్‌పేట ఆరో జంక్షన్‌, బొగ్గులకుంట, సుల్తాన్‌బజార్‌, కింగ్‌ కోఠి, నిజాం కాలేజ్‌ గేట్‌ నెం 4, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, నాచారం, మల్లాపూర్‌, తార్నాక, లాలాపేట్‌, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, మోండా మార్కెట్‌, పార్శీగుట్ట, వారాసిగూడ, చిలకలగూడ, పద్మారావునగర్‌, మారేడ్‌పల్లి, అల్వాల్‌, బొల్లారం, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, రామాంతపూర్‌, ఉతప్పల్‌, బోడుప్పల్‌, ఘట్‌కేసర, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.

రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర‍్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు అతి కష్టం మీద కార్యాలయాలు, కళాశాలలకు చేరుకుంటున్నారు. ఎల్బీనగర్‌లో 5.4, ఆస్మాన్‌గడ్‌లో 4.8, నారాయణగూడలో 4.6, నాంపల్లిలో 4.2, ఆసిఫ్‌నగర్‌లో 4.2 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు గంటల పాటు నగరవ్యాప్తంగా వర్షం కొనసాగుతుందని వెల్లడించారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *