హీరోల‌ పై జ్యోతిక షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్…ఇలా ఏ ఇండ‌స్ట్రీలో చూసినా హీరోల డామినేష‌న్ ఎక్కువ‌. స్టార్ హీరోల సినిమాలు యావ‌రేజ్ గా ఉన్నా స‌రే మొద‌టి నాలుగైదు రోజులు క‌లెక్ష‌న్ల‌కు ఎటువంటి ఢోకా ఉండ‌దు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఒక‌రో ఇద్ద‌రో నిర్మాత‌లు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీయ‌డానికి ముందుకు వ‌స్తారు. అయితే, సినీ రంగంలో ఈ పరిస్థితి మారాల‌ని త‌మిళ న‌టి జ్యోతిక అభిప్రాయ‌ప‌డ్డారు. చిత్ర పరిశ్రమలో మగవారిదే పైచేయి అని, హీరోలు న‌టించిన ఎంత చెత్త సినిమా అయినా నాలుగైదు రోజులు ఆడుతుంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో పురుషాధిక్యత అధికంగా ఉంద‌ని జ్యోతిక మండిప‌డ్డారు. హీరోలు నటించిన సినిమా ఎంత చెత్త‌గా ఉన్నా నాలుగైదు రోజులు ఆడతుందన్నారు. అదే ఎంత మంచి హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం అయినా  వారం తరువాతే వసూళ్లు రాబ‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినీ రంగంలో మహిళా రచయితలకు ప్రాముఖ్యత తక్కువేన‌ని, ఈ పరిస్థితి మారాలని జ్యోతిక అన్నారు. సుధ కొంగరకు మాధవన్‌ అవకాశం కల్పించకపోతే ఇరుదుచుట్రు లాంటి గొప్ప చిత్రం వచ్చేది కాదన్నారు. పరిశ్రమలో మహిళలకు తగిన స్థానం కల్పించాల‌ని జ్యోతిక కోరారు. వయదినిలే చిత్రంతో జ్యోతిక త‌న సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.  ఈ నెల 15న మగళీర్‌ మట్టుం అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాలో నటి ఊర్వశి, శరణ్యపొన్‌వన్నన్, భానుప్రియ కూడా నటించారు. రోడ్‌ట్రిప్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇంతకు ముందెప్పుడూ తెర‌కెక్క‌ని కథతో ఈ చిత్రాన్ని రూపొందించార‌ట‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *