కల్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకోండిలా..

18 సంవత్సరాలు నిండిన దళిత, గిరిజన, ముస్లీం, సిక్ అమ్మాయికి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అమ్మాయి తరపు వారికి రూ.51,000 వేలు మంజూరు చేస్తున్నారు. ఈ పథకం 2014, అక్టోబర్ 2 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు http://epasswebsite.cgg.gov.in అను వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. –

* తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు మాత్రమే అర్హులు.
* దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం 2,00,000లకు మించరాదు.
* అమ్మాయి వయస్సు వివాహ సమయానికి 18 సంవత్సరాలు నిండాలి.
* ఈ పథకం అమలులోకి వచ్చిన నాటి (2014, అక్టోబర్ 2) నుంచి జరిగే వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
* మీ సేవ కేంద్రాలు, ఏదైనా ఇంటర్‌నెట్ కేఫ్‌లలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
* ఈ కింద తెలిపిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి దరఖాస్తు ఫారానికి జత చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు అన్నీ మీ సేవ ద్వారా సంబంధిత అధికారి జారీ చేసినవై ఉండాలి.

దరఖాస్తుకు జతపర్చాల్సిన పత్రాలు…

l వధూవరుల వయస్సు ధ్రువీకరణ కోసం ఎస్సెస్సీ మెమో (చదువుకున్న వారైతే) దరఖాస్తుకు జతపర్చాలి. చదువుకోని వారైతే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)
* కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్)
* ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కాం సర్టిఫికెట్)
* నివాస ధ్రువీకరణ పత్రం (రెసిడెన్సీ సర్టిఫికెట్)
(వివాహం జరిగిన తేదీ నాటికి మీ సేవ ద్వారా సంబంధిత అధికారి జారీ చేసినదై ఉండాలి)
* ఆధార్ కార్డు (వధువు, వరుడు ఇద్దరివి)
* బ్యాంకు ఖాతా (వధువు పేరు మీద జారీ చేసిన ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకు రావాలి)

పెళ్లి అయిపోతే…

ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు పెళ్లికి ముందు, తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పెళ్లితంతు పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకునేవారు పైన పేర్కొన్న ధ్రువ పత్రాలతో పాటు ఈ కింది ఆధారాలు కూడా జతపర్చాల్సి ఉంటుంది.
* శుభలేఖ (వెడ్డింగ్ కార్డు)
* పెళ్లికి సంబంధించిన ఐదు ఫొటోలు జతపర్చాలి.
* సంబంధిత అధికారులు జారీ చేసిన పెళ్లి ధ్రువీకరణ పత్రం జత పర్చాలి.

దరఖాస్తు స్వీకరణ ఎక్కడ?

ఆన్‌లైన్‌లో ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత మీ సేవ లేదా ఏదైనా ఇంటర్‌నెట్ కేంద్రం వారు దరఖాస్తుకు సంబంధించి ప్రింటెడ్ కాపీ ఇస్తారు. దానిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించాలి. తర్వాత జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *