డ్రగ్స్ కేసులో సుబ్బరాజు చెప్పిన ఆ 15 మంది వాళ్ళే? అందరికి మూడినట్లే?

హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో సినిమా ప్రముఖులని విచారిస్తున్న ఎక్సైజ్ అధికారులకి రోజుకో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఒక్కొక్కరిని విచారిస్తున్న కొద్ది కేసుకి సంబంధించి చాలా కీలకమైన విషయాలు విచారణ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే ఆ విషయాలపై ఎలాంటి సమాచారం బయటకు రాకున్న, సిట్ అధికారులు చెబుతున్న విషయాలు బట్టి కొన్ని మాత్రం అర్దమవుతున్నాయి. శుక్రవారం సిట్ విచారణలో పాల్గొన్న నటుడు సిబ్బరాజు మొదటిగా విచారణ అధికారులకి పెద్దగా సహకరించాకపోయిన తరువాత కొన్ని ఆధారాలు చూపించిన అధికారులకి ఆసక్తికరమైన వాస్తవాలు చెప్పినట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీలో డ్రగ్స్ తో సంబంధాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అతను చెప్పినట్లు తెలుస్తుంది. వారిలో ఓ 15 మంది కీలక వ్యక్తుల గురించి సుబ్బరాజు సిట్ విచారణలో బయట పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఆ 15 మంది ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్న. సిట్ అధికారులు త్వరలో వారికి నోటీసులు పంపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు డ్రగ్స్ వ్యవహారంలో ఇండస్ట్రీలో కొద్ది మందికే సంబంధాలు ఉన్నాయని అందరు అనుకున్న ఇప్పుడు పరిస్తితులు బట్టి చాలా మంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విచారణ ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా సక్రమంగా సాగుతుందా. లేక రాజకీయ నాయకులు, లేదంటే అండర్ వరల్డ్ మాఫియా ఒత్తిళ్ళకి పోలీసులు లోగిపోతారా అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *