ప్లాన్-ఎ పోయింది.. ఇప్పుడు ప్లాన్-బి

అజ్ఞాతవాసి సినిమాలో కీలకమైన డైలాగ్ ఇది. ప్లాన్-ఎ వర్కవుట్ కాకపోతే ప్లాన్-బి అమలు చేస్తారన్నమాట. సినిమాలో కీలకమైన పాయింట్ కూడా ఇదే. మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ పాయింట్ నే ట్రెండింగ్ చేస్తున్నారు ప్రేక్షకులు. కాకపోతే రివర్స్ లో.

అజ్ఞాతవాసి సినిమాను ప్లాన్-ఎగా వర్ణిస్తున్న ప్రేక్షకులు.. దయచేసి ప్లాన్-బి సెలక్ట్ చేసుకోండంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇదే సినిమాలో మరో డైలాగ్ కూడా ఉంది. కొత్త ఐడియా రానప్పుడు, పాత ఐడియానే ఫాలో అయిపోవాలంటాడు పవన్. ఈ డైలాగ్ ను కూడా నెటిజన్లు వదల్లేదు.

పాత ఐడియాలతో తెరకెక్కిన కొత్త సినిమా అజ్ఞాతవాసిని చూసి టైం, మనీ వేస్ట్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. దీనికి బదులు పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమానే యూట్యూబ్ లో మరోసారి చూడమని సలహాలిస్తున్నారు.

మరోవైపు బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ ప్లాన్-బిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బి ఫర్ బాలయ్య అంటూ మరో ట్రెండింగ్ షురూ చేశారు. ప్లాన్-ఎ బెడిసికొట్టింది కాబట్టి, ప్లాన్-బి ని అమలు చేయమంటున్నారు. ప్లాన్-బి అంటే వాళ్ల దృష్టిలో బాలయ్య నటించిన జై సింహా సినిమా.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *