కరోనా వైరస్ సోకితే…

చైనా దేశంలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రజలను కలవరపెట్టిస్తోంది. చైనా దేశంలో ఈ వైరస్ వల్ల 830  మంది ఆసుపత్రుల్లో చేరారు.  చైనాలోని హుబే ప్రావిన్సులో కరోనావైరస్ తో 25 మంది మరణించారు. ఈ వైరస్ తో ఆసుపత్రిలో చేరిన 34 మంది రోగులు కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేశామని చైనా వైద్యులు చెప్పారు. చైనా దేశంలోని ఊహాన్ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్, థాయ్‌లాండ్, సౌదీఅరేబియా దేశాలకు వ్యాపించిందికరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఊహాన్, హుంగాగ్యాంగ్ నగరాల నుంచి ప్రజల రాకపోకలను నిషేధిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. ఊహాన్ నగరంలోని సముద్రపు చేపలు, మాంసం మార్కెట్ ల వల్లనే కరోనా వైరస్ సోకిందని వైద్యులు చెపుతున్నారు. ఈ కొత్త కరోనా వైరస్ పై చైనాలో పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగాభావిస్తున్నారు.విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారం తినే వాళ్లు కొన్నాళ్లపాటు దానికి దూరంగా ఉండడం మేలు.అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్‌లను వాడడం మంచిది.. విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి  జలుబు చేస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు ప్రజలకు సూచించారు.అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్‌లను వాడడం మంచిది వైరస్‌ను మైక్రోస్కోపులో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించిందని, అందుకే దీనికి ఈ పేరు పెట్టినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు రాశాయి..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *