ఈలక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి

    వ్యాధి లక్షణాలు ;వైరస్‌కోవిడ్‌-19 బారిన పడిన వ్యక్తుల్లో 28 రోజులలోపు లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన న్యూమోనియాతో ఊపిరి పీల్చుకో వడానికి ఇబ్బందిగా ఉండడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు ; ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ కన్నానివారణ ఒక్కటే మార్గం. ముఖ్యంగా వైరస్‌ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్‌, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువులతోనూ జాగ్రత్తలు అవసరం. కరోనావైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి జైడస్ కాడిల్లా సంస్థ నడుం బిగించింది. ఈ మేరకు భారత్ తోపాటు యూరప్‌లోని పలు బృందాలతో వేగంగా పరిశోధన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో ప్రధానంగా ప్లాస్మ్ ఐడి డిఎన్ఎ హోస్ట్ కణాలలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ ఇది వైరల్ ప్రోటీన్లోకి అనువదించబడటంతో పాటు, రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను పొందుతుంది, ఇది వ్యాధి నుండి రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే వైరల్ క్లియరెన్స్ కోసం ఈ ప్రయోగం పనిచేస్తుంది. ఇక రెండో విధానం ప్రకారం COVID-19 కు వ్యతిరేకంగా లైవ్ అటెన్యూయేటెడ్ రీకాంబినెంట్ మీజిల్స్ వైరస్ వెక్టర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తారు. రివర్స్ జెనెటిక్స్ ఉత్పత్తి చేసిన రీకాంబినెంట్ మీజిల్స్ వైరస్ (ఆర్‌ఎమ్‌వి) కరోనా వైరస్ లోని కోడాన్-ఆప్టిమైజ్ చేసిన ప్రోటీన్‌ ప్రతిరోధకాలను ప్రేరేపిస్తుంది, దీంతో సంక్రమణ నుండి రక్షణ లభిస్తుంది.ఈ వైరస్ వ్యాప్తిని నివారించగల సురక్షితమైన మరియు సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, ఇటీవలి కాలంలో ఈ అత్యంత వినాశకరమైన వ్యాప్తికి వేగవంతమైన పరిష్కారం తీసుకురావడానికి మా పరిశోధకులు కృషి చేస్తున్నారు” అని జైడస్ గ్రూప్ చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ అన్నారు.

చికెన్‌, మటన్‌ తినడం వలన కోవిడ్‌-19 వైరస్‌ వస్తుందనే వదంతులను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఏ ఆహారమైనా ఎక్కువగా ఉడికించుకొని తింటే ఎలాంటి రోగాలు రావని చెబుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *