ఇమ్రాన్ ఖాన్ అణుయుద్ధం పై వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధాని మరోసారి అణుయుద్ధం పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు భారత్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు తన మాటను మార్చి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. తాజాగా  ఆయన మరోసారి అణుయుద్ధం గురించి ప్రపంచానికి హెచ్చరికలు చేశారు. లాహోర్ లో జరిగిన అంతర్జాతీయ సిక్కు సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘భారత్-పాక్ రెండు అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు. ఇప్పుడు ఒకవేళ రెండు దేశాల మధ్య ఉద్రికతలు తారస్థాయికి చేరితే అది ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కానీ ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. పాకిస్తాన్ ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించాదు. ఓడిన దేశమే కాదు గెలిచిన దేశం కూడా కోలుకోవడానికి సమయం పడుతుంది’ అని అన్నారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన జరిగిన నాటి నుంచి పాక్‌ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ తమ అంతర్గత అంశమని భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు స్పష్టం చేస్తున్నా పాకిస్తాన్‌ మాత్రం పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సహనాన్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు అణు యుద్ధానికి సిద్ధమన్న ఇమ్రాన్ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక పరిస్తితులు నెలకొన్నాయి.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *