గంగూలీ వల్లనే తొలి టెస్ట్‌ డ్రా

శ్రీలంకతో తొలి టెస్ట్‌ డ్రాగా ముగియడంతో ఇపుడు విమర్శకుల దృష్టి పిచ్‌పై పడింది. పిచ్‌ స్వభావమే భారత్‌ కు విజయాన్ని దూరం చేసిందని విమర్శ కులు భావిస్తున్నారు. ఇందులో సౌరవ్‌ గంగూలీ పాత్ర ఉందన్నది వారి భావన. మొదటినుంచీ బౌలర్ల పక్షపాతి అయిన గంగూలీ వల్లనే విజయం దూరమైందని వారు అంటున్నారు. బౌలర్లకు సహకరిం చే పిచ్‌ను రూపొందించడమే గంగూలీ చేసిన పొరపాటని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ గంగూలీ బౌలర్లకు అనుకూలంగా మార్చడంతో సిరీస్‌ లో భారత్‌ ఆధిక్యం సాధించే అవకాశం కోల్పోయిందన్నది వారి వాదన. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు బౌన్సీ పిచ్‌లపై ఆడాల్సి ఉండడంతో అందుకు సన్నాహ కంగా ఈడెన్‌ పిచ్‌ను పేసర్లకు అనుకూలంగా తీర్చిదిద్దారు.
బౌలర్ల పక్షపాతి: క్రికెట్‌కు మరింత ఆదరణ కలిగిం చాలంటే బ్యాట్‌కు, బంతికి మధ్య సమాన పోటీ ఉండాల న్నది గంగూలీ అభిప్రాయం. ఆటగాడిగా, కామెంటేటర్‌గా ఉన్నపుడు నిబంధనలు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నా యని గంగూలీ తరచూ చెబుతుండేవాడు. బ్యాట్‌కు, బంతికి మధ్య పోరు ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆటను ఆస్వాదిస్తారన్నది గంగూలీ అభిప్రాయం. అయితే ప్రస్తుతం క్రికెట్‌ నిర్వహణలో భాగమైన దాదా ఈడెన్‌ పిచ్‌ను మార్చాలని భావించాడు. ఈడెన్‌లో మారిన పిచ్‌పై భారత జట్టు తొలుత న్యూజిలాం డ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో ధవన్‌ వేలికి గాయమవడం విమర్శలకు దారితీసినా భువనేశ్వర్‌ ఐదు వికెట్లతో చెలరేగ డం, భారత్‌ విజయం సాధించడంతో పిచ్‌ గురించి మర్చిపోయారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *