పెద్ద నోట్ల ర‌ద్దుతో సెక్స్ వ‌ర్క‌ర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకే

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు అంశం దేశ‌వ్యాప్తంగా అంద‌రిని ఓ కుదుపు కుదిపేస్తోన్న సంగ‌తి తెలిసిందే.మోడీ తీసుకున్న ఈ నిర్ణయం నల్లబాబుల నడ్డి విరుస్తుందో లేదో తెలియదు కానీ.. సామాన్యప్రజానికి మాత్రం చలికాలంలో చెమటలు పట్టిస్తోంది. నోట్ల కష్టాల రుచిని చూపిస్తోంది. సామాన్యులే విల‌విల్లాడుతుంటే ఇక శ‌రీరాన్నే న‌మ్ముకుని…శ‌రీరాన్నే ప‌ణంగా పెట్టి ఏరోజు కారోజు జీవ‌నం కొన‌సాగించే సెక్స్ వర్కర్ల బాధ‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సోనగాచీ జిల్లాలో అనేక ప్రాంతాలు వ్యభిచారానికి మారుపేరు. దేశంలోనే ఇది పెద్ద రెడ్‌లైట్ ఏరియాగా ప్ర‌సిద్ధి. ఇక్క‌డ‌కు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి విటులు వ‌స్తుంటారు. ఈ ప్రాంతాలలో అనేక మంది మహిళలు వ్యభిచారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ పెద్దనోట్ల రద్దు వారి పొట్టకొట్టింది. వ్యభిచారానికి మహిళల దగ్గరకు వచ్చే పురుషులు రూ.500, రూ.1000 నోట్లను తీసుకొస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.

పాత నోట్లు తీసుకుంటే వాటిని మార్చుకునేందుకు వారికి త‌ల‌ప్రాణం తోక‌కు రావ‌డం ఖాయం. దీంతో వారు క‌స్ట‌మ‌ర్ల‌ను దూరం చేసుకోవ‌డం ఇష్టం లేక వ్య‌భిచారాన్ని అప్పుగా ఇస్తున్నార‌ట‌.త‌మ వ‌ద్ద‌కు రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల కోసం మ‌హిళ‌లు ఓ బుక్ పెట్టుకుని అందులో విటులు ఎన్ని సార్లు వ‌చ్చింది నోట్ చేసుకుంటున్నార‌ట‌.

కొత్త నోట్లు వ‌చ్చాక త‌మ‌కు ఇవ్వాల‌ని వారు చెపుతున్నారు. సోనగాచీ జిల్లాలో మాత్రమే ఈ పరిస్థితి ఉందనుకుంటే పొరపాటే.. వ్యభిచారమే ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్న వారి పరిస్థితి దాదాపు ఇంతేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *