దేశంలోకి జైషే ఉగ్రవాదులు…

ఆర్టికల్-370, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌ కోట్‌, జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *