సాహోలో ప్రభాస్ ద్విపాత్రాభినయం?

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సాహో రిలీజ్‌కు ఇంకా పది రోజులు మాత్రమే సమయముంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తర్వాత ఈ  సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అదే స్థాయిలో ఈ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. సాహోలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న టాక్‌ చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ల రిలీజ్‌ తరువాత ఆ టాక్‌ మరింత బలపడింది. ప్రభాస్ రెండు రకాల హెయిర్‌ స్టైయిల్స్‌తో కనిపిస్తుండటంతో సినిమాలో ప్రభాస్‌ అండర్‌కవర్‌ పోలీస్‌గా, దొంగగా రెండు పాత్రల్లో కనిపిస్తాడని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *