ఐఎస్‌ టార్గెట్‌ కుంభమేళా

భారత్‌లో లాస్‌వెగాస్‌ తరహా దాడులతో విరుచుకుపడతామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) హెచ్చరించింది. రానున్న రోజుల్లో కుంభమేళా, త్రిసూర్‌పురంలో జనసమ్మర్థంపై భారీ దాడులకు దిగుతామని పదినిమిషాల ఆడియో క్లిప్‌లో ఐఎస్‌ హెచ్చరించింది. మలయాళంలో హెచ్చరిస్తూ ఈ ఆడియో క్లిప్‌లు విడుదలయ్యాయని తెలిసింది. కుంభమేళా, త్రిసూర్‌ పురం వంటి ఉత్సవ వేడుకలే లక్ష్యంగా భారీ విధ్వంసంతో చెలరేగుతామని ఐఎస్‌ హెచ్చరించింది.

భారత్‌లో ఉగ్ర దాడి తప్పదని ఖురాన్‌ను ఉటంకిస్తూ ఈ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. మ్యూజిక్‌ కాన్సర్ట్‌లో లాస్‌వెగాస్‌ కాల్పుల్లో పెద్దసంఖ్యలో అమాయక ప్రజలు మరణించిన ఉదంతాన్ని ఈ క్లిప్‌లో విస్పష్టంగా ప్రస్తావించారు. లాస్‌వెగాస్‌ కిల్లర్‌ తమ మనిషేనని ఐఎస్‌ పేర్కొంది. మీ మేథకు పదును పెట్టంది…విషం కలిపిన ఆహారం వారికివ్వండి…ట్రక్‌లు ఉపయోగించండి..త్రిసూర్‌పురం లేదా మహా కుంభమేళాపై ప్రజలే లక్ష్యంగా విరుచుకుపడండి అంటూ ఈ క్లిప్‌లో ఉగ్రమూకలను ప్రేరేపించారు. కనీసం రైలు పట్టాలు తప్పేలా ప్రయత్నించండి..కత్తులతోనూ స్వైరవిహారం చేయంటి అంటూ ఈ క్లిప్‌లో మేల్‌ వాయిస్‌ ఉంది.

కాగా ఆప్ఘనిస్తాన్‌ నుంచి టెలిగ్రాం మెసెంజర్‌ను ఆడియో క్లిప్‌గా మార్చారని పోలీసులు చెబుతున్నారు. క్లిప్‌లో ఉన్న మేల్‌ వాయిస్‌ ఐఎస్‌ నేత రషీద్‌ అబ్దుల్లాదిగా చెబుతున్నారు. అబ్ధుల్లాపై పలు సెక్షన్ల కింద ఎన్‌ఐఏ చార్జిషీట్‌ రూపొందించింది. ఆడియో క్లిప్‌తో నిఘా వర్గాలు, పోలీసు శ్రేణులు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు యూరప్‌, మధ్య ప్రాచ్యం నుంచి భారత్‌ వైపు దృష్టిసారించడం తీవ్ర ఆందోళనకరమని ఆడియో క్లిప్‌లపై స్పందిస్తూ మాజీ కేబినెట్‌ సెక్రటేరియట్‌ ప్రత్యేక కార్యదర్శి వి బాలచంద్రన్‌ వ్యాఖ్యానించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *