టాలీవుడ్ ప్రముఖులకు ఐటీ ఫీవర్..!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సినీ రంగాన్ని కూడా బాగానే ఇబ్బంది పెట్టింది. నోట్ల చెలామణి తగ్గిపోవడంతో చాలా సినిమాల షూటింగులు వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చాలామంది చిన్న నిర్మాతలు టెన్షన్ లో ఉన్నారు. అయితే పెద్ద చిత్రాల నిర్మాతలూ తారల విషయంలో పరిస్థితి ఇంకోలా ఉంది! ప్రముఖ నిర్మాతలూ హీరోలకు ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ రూపంలో కొత్త టెన్షన్ మొదలైందట! సరైన సమాచారం తమ వద్ద ఉంటే సినీ ప్రముఖులపై ఐటీ దాడులు చేసేందుకు అధికారులకు సర్వాధికారులూ ప్రభుత్వం ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కొంతమంది టాలీవుడ్ పెద్దలకు కొత్త టెన్షన్ మొదలైందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థల కార్యాలయాలపైనా… ప్రముఖుల ఇళ్లపైనా ఐటీ నిఘా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి 150 చిత్రం గురించిన ప్రస్థావన వినిపిస్తూ ఉండటం విశేషం. సంక్రాంతికి విడులైన మెగాస్టార్ 150 మూవీ మొదటి వారంలోనే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టిందని నిర్మాతలే ప్రకటించారు. దాదాపు రూ. 100 కోట్లు ఈ చిత్రం వసూళ్లు చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిర్మాత రామ్ చరణ్ పై ఆదాయ పన్ను శాఖ కన్ను వేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారిపై కూడా ఐటీ నిఘా ఉందని చెబుతున్నారు.

సినిమాలు విడుదలైన వారంలో భారీ ఎత్తున కలెక్షన్లు సాధించామని చెప్తూ… ఆ తరువాత ఆ ఆదాయానికి లెక్క చూపకుండా పన్నులు కట్టకుండా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐటీ శాఖ సమాయత్తం అవుతున్నట్టు కథనాలు బలంగానే వినిపిస్తున్నాయి. అలాగే భారీ పారితోషికాలు తీసుకుంటూ… ప్రభుత్వానికి లెక్కలు చూపని ప్రముఖ తారలపై కూడా అధికారుల నిఘా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరి కార్యాలయంపై ఐటీ దాడులు ఉంటాయా అనే టెన్షన్ టాలీవుడ్ వర్గాల్లో పెరిగిందని అంటున్నారు!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *