‘జై సింహా’ కథ ఇదేనంటూ ప్రచారం..!

బాలకృష్ణ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న బాలయ్య తన 100 వ చిత్రం నుండి స్టైల్ మార్చాడు. తన 100 వ చిత్రాన్ని కెరీర్ లో నిలిచిపోయే చిత్రంగా చారిత్రాత్మక విలువలున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథతో చేశాడు. వెనువెంటనే పూరితో ‘పైసా వసూల్’ అంటూ మాస్ కి నచ్చే చిత్రం చేశాడు. ఇక ఇప్పుడు కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో ‘జై సింహా’ అంటూ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్పుడే సగంపైనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమా కథ మాత్రం చాలా కొత్తగా ఉండబోతుందంటూ ఒక న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది.

నయనతార, హరిప్రియ, నటాషా జోషీలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కథ గురించిన ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘జై సింహా’ సినిమా మొత్తం కుటుంబ విలువలు, ప్రేమ, అనుబంధాలు, త్యాగాలు ఇలా సాగిపోతుందంటున్నారు. ఇక కథ విషయానికొస్తే బాలకృష్ణ.. నయనతార ని గాఢంగా ప్రేమిస్తాడని.. కానీ అనుకోని పరిస్థితుల్లో నయనతార, బాలకృష్ణ ని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని, అలాగే బాలకృష్ణ, హరిప్రియని పెళ్లాడతాడని.. వారికి పుట్టిన బిడ్డను పిల్లలు లేని నయనతారకి బాలకృష్ణ ఇచ్చేస్తాడనేది ఈ ‘జై సింహా’ సినిమా కథ సారాంశంగా అనుకుంటున్నారు.

మరి కుటుంబం, ప్రేమ, త్యాగం అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇదే పాయింట్ ని దర్శకుడు రవికుమార్ ప్రేక్షకులకు అర్ధమయ్యేలా ఎలా తెరకెక్కిస్తాడనేదే అసలు పాయింట్. మరి ఈ తరహా కథలను రవికుమార్ తనదైన స్టయిల్లో బాగానే తెరకెక్కించి హిట్స్ కొట్టాడు. ఇక ఇప్పుడు కూడా ‘జై సింహా’ని నందమూరి అభిమానులు నచ్చేవిధంగానే తీస్తాడంటున్నారు. ఇక ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తుండగా … సంక్రాంతి కానుకగా ‘జై సింహా’ని విడుదల చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *