లావుగా ఉన్నా.. పడక గదికి సూట్ అవుతావ్

సరిగ్గా ఇదే మాట అన్నారా? అంటే దాదాపుగా దీనికి దగ్గరగా అన్నారని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. దీని కంటే దారుణంగా అన్నారనే చెప్పక తప్పదు. ఇంతకీ ఈ మాటను ఎవరితో ఎవరు అన్నారు? ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? అన్న క్వశ్చన్లకు ఆన్సర్లు తెలుసుకోవాలంటే.. ముందుగా మూడు ముక్కలు ఓపిగ్గా చదవాల్సిందే.

ఈ మధ్యన క్యాస్టింగ్ కోచ్ అన్న మాట చిత్రపరిశ్రమలో బాగా వినిపిస్తోంది. సినిమాల్లో ఛాన్సుల కోసం అమ్మాయిలకు వల వేయటం. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే.. సినిమాలో ఛాన్స్ ఇస్తా.. లైంగికంగా ఓకే అంటావా అని అడగటం. ఈ ఇష్యూ అన్ని సినీ పరిశ్రమల్లో ఉంటుందన్న మాట ఈ మధ్యన పలువురు నటీమణుల మాటలతో బయటకు వచ్చేసింది. పనిలో పనిగా టాప్ స్టార్లుగా వెలిగిపోయే వారికి ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయన్న విషయం వెల్లడైంది.

తాజాగా ఆ లిస్టులోకి చేరారు హాలీవుడ్ ప్రముఖ నటి జెన్నీఫర్ లారెన్స్. తన నటజీవితానికి సంబంధించి సంచలన విషయాల్ని వెల్లడించింది జెన్నీఫర్. సుమారు 20 ఏళ్ల పాటు  ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్ స్టన్  చేసిన అకృత్యాలపై ఇటీవల నటీమణులు పెద్ద ఎత్తున వాస్తవాలు వెల్లడిస్తున్న వేళ.. జెన్నీఫర్  కొత్త విషయాల్ని చెప్పుకొచ్చారు. తన పదహారేళ్ల వయసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక నిర్మాత తనతో మాట్లాడుతూ… “నువ్వు కొంచెం లావుగా ఉన్నా.. బెడ్రూంలో టైం స్పెండ్ చేయటానికి ఆకర్షణీయంగా ఉన్నావ్” అని  అన్నాడని.. కెరీర్ను దృష్టిలో పెట్టుకొని తాను ఆ విషయాల్ని వెల్లడించలేదన్నారు.

చివరకు ఒక మహిళా నిర్మాత విషయాన్ని ఆమె చెప్పారు. సినిమా చాన్స్ కోసం తనను బరువు తగ్గాలని చెప్పిన మహిళా నిర్మాత.. తనలా అవకాశాల కోసం వచ్చిన నలుగురు అమ్మాయిల్ని నగ్నంగా నిలబెట్టిందని.. వారితో పాటు తానూ ఉన్నానని చెప్పింది. అందులో ఒక అమ్మాయి లావుగా ఉందని రిజెక్ట్ చేశారన్నారు. నువ్వే నీ న్యూడ్ ఫోటోలు తీసుకుంటే త్వరగా బరువు తగ్గాలన్న స్ఫూర్తి నీకు వస్తుందంటూ తనను కామెంట్ చేసిందని చెప్పింది. కలల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఇవ్వాలన్న గళాన్ని తాను విప్పనున్నట్లుగా వెల్లడించింది జెన్నిఫర్. తరచి చూస్తే.. ఇలాంటివి మరెన్ని ఉంటాయో?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *