జియోఫోన్ ఆన్ చేస్తే ఏం చూపిస్తుందో తెలుసా..!

గ్రామీణులకు సైతం 4జీ టెక్నాలజీ రుచిచూపించేందుకే రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జియోఫోన్’… విడుదలకు ముందే వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకున్నవారు ఎప్పుడు తమ చేతికి వస్తుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జియోఫోన్‌లో ఫీచర్లు ఎలా ఉంటాయి.. నాణ్యత సంగతేంటి… ఇలా పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియో జియో అభిమానుల అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఫోన్ ఆన్ చేయగానే జియో డిజిటల్‌ లైఫ్ అన్న లోగోతో స్వాగతం పలుకుతోంది. ఆన్‌చేసిన తర్వాత పాప్‌అప్ కావడానికి దాదాపు ఒక నిమిషం పాటు సమయం తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. తర్వాత మాత్రం ఫోన్ పనితీరు వేగంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *