ఎన్టీఆర్ 27 టైటిల్ ఇదే..!

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై చాలా ఉత్కంఠే నడిచింది. వక్కంతం వంశీ, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ ఇలా చాలా మంది డైరెక్టర్ల వచ్చి నట్టేవచ్చి మాయమైపోయారు. కానీ తారక్ మాత్రం చివరికి సర్ధార్ గబ్బర్ సింగ్ బాబీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాబీ చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో బాబీతో సినిమాకు రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యామ్ రామ్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.

యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమా ప్రారంభానికి ముందు నుంచే ఈ సినిమాకు జై లవకుశ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 27వ చిత్రానికి జై లవకుశ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో  భాగంగా ఉపయోగిస్తున్న క్లాప్ బోర్డ్ పై ఇదే టైటిల్ ఉందని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ 27కు జై లవకుశ అనే టైటిల్ ను  కన్ఫామ్ చేసినట్టే అని భావిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్‌ గా రాశిఖన్నాను  కన్ఫామ్ చేయగా మరో హీరోయిన్‌ గా  నివేదా థామస్ ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని కూడా ప్రకటిస్తారని భావించారు కానీ.. అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్. ఇద్దరు హీరోలూ ఒక విల క్యారెక్టర్లు కావటంతో ఈ విలన్ పాత్రకి హీరోయిన్ లేదన్నమాట. ఈ సినిమాలోని మూడు పాత్రలకు సంబంధించి.. మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడట యంగ్ టైగర్. అందుకే తన బాడీని సరైన షేప్ లోకి మార్చుకునేందుకు తెగ వర్కవుట్స్ చేసేస్తున్నాడట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *