ఎన్టీఆర్ చాలా మారిపోయాడే

తారక్ యమ టెన్షన్ తో రోజులు గడుపుతున్నాడు. ఇంకో 48 గంటల లోపే జై లవకుశ మొదటి షో పడనుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్ చానెల్స్ బాగా యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి అది పూర్తి కాగానే రివ్యూల రూపంలో టాక్  బయటికి వచ్చేస్తుంది . పైగా ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ భారీ సినిమా ఏది రాకపోవడంతో బాక్స్ ఆఫీస్ చాలా నీరసంగా ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాలు మొత్తం జై లవకుశ ఫీవర్ తో ఊగిపోతున్నాయి.

విస్తృతంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న తారక్ ఎన్నడు లేనంత ఓపెన్ గా బోల్డ్ గా మాట్లాడ్డమే కాదు సరికొత్త మాట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. తన నచ్చిన బెస్ట్ డాన్సర్ అల్లు అర్జున్ అని కితాబు ఇచ్చి అందరిని షాక్ కి గురి చేసిన తారక్ మెగా హీరోస్ పట్ల తన దృక్పధం నెగటివ్ గా ఏమి లేదని మరో సారి చాటి చెప్పాడు. గతంలో బాద్షా ఓపెనింగ్ లో తారక్, రామ్ చరణ్ కలిసి ఎంత రచ్చ  చేసారో గుర్తుందిగా.

అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి పరోక్షంగా ప్రెస్ ప్రస్తావించినప్పుడు కూడా ప్రజలకు ఏ పార్టీ అయినా మంచే చేయాలనీ కోరుకుంటానని, అంతే తప్ప వ్యక్తిగతంగా ఇదే ఉండాలి అనే ప్రాధాన్యత ఏది లేదు అని చెప్పేసాడు. మాట్లాడింది పాత తారక్ అయితే తెలుగుదేశం ఉండగా ఇంకే పార్టీ అవసరం లేదు అనేవాడు. కాని స్వరం మార్చి ఏదైనా ఒకటే, జనానికి మేలు జరిగితే చాలు అంటున్నాడు.

అలాగే మీడియా మిత్రుడు అడిగిన దానికి సమాధానంగా నరసింహ నాయుడు సినిమాలో డైలాగ్ చెప్పి అలరించిన జూనియర్ అదే పనిగా బాలకృష్ణ ప్రస్తావన తానుగా మాత్రం తీసుకురాలేదు. మొత్తానికి తన ఆటిట్యూడ్ తో అందరిని పడగొట్టే పనిలో తారక్ వంద శాతం సక్సెస్ అవుతున్నాడు. జై లవకుశ ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డు కూడా తెస్తుంది అన్న కళ్యాణ్ రామ్ మాటలు సినిమాపై అంచనాలను మరో మెట్టు పైకి ఎక్కించాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *