ద‌గ్గుబాటికి ఎన్టీఆర్ ఇచ్చిన ఆఫ‌ర్ ఏంటి..!

జనతా గ్యారేజ్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే వ‌క్కంతం వంశీతో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. వంశీతో పాటు ఆ జాబితాలో చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లే విన‌ప‌డ్డాయి. అయితే ఎవ్వ‌రూ ఫైన‌లైజ్ కాలేదు.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ కొంత‌మందికి బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చాడ‌ట‌. అయితే వాళ్లు ఎన్టీఆర్ డేట్స్‌ను స‌రిగా యూజ్ చేసుకోలేక‌పోతున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీతో ఎన్టీఆర్‌కు మంచి స‌బంధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. రామానాయుడు కూడా ఎన్టీఆర్‌తో రాముడు-భీముడు రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేశాడు.

ఎన్టీఆర్‌కు ద‌గ్గుపాటి ఫ్యామిలీ అంటే ఎన‌లేని గౌర‌వం. వెంకీ సినిమా చింతకాయల రవి సినిమాలో ఎన్టీఆర్ ఓ సాంగ్‌లో తళుక్కున మెరుస్తాడు. అలాగే సురేష్ బాబుకి ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆశ. అయితే ఎన్టీఆర్ కూడాఈ బ్యాన‌ర్‌లో సినిమా చేసేందుకు రెడీగానే ఉన్నాడు.

ఓ కొత్త డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ ఎన్టీఆర్‌కు అటు సురేష్‌బాబుకు ఇద్ద‌రికి న‌చ్చింద‌ట‌. మ‌రి ఇంత‌లో ఏమైందో గాని సురేష్‌బాబు మాత్రం ఎన్టీఆర్ డేట్స్‌ని ఇంకోసారి వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఎన్టీఆర్‌కి సారీ చెప్పేశాడట. ఆ యువ డైరెక్టర్ కృష్ణ చెప్పిన కథతో నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడట సురేష్ బాబు. సో ఎన్టీఆర్ సినిమా చేస్తాన‌ని ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌ను సురేష్‌బాబు ఎందుకు వ‌దులుకున్నాడా ? అని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *