కాజల్ మళ్లీ ఊపందుకుంది..!

అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్ధకాలం నుంచి వెండితెర మీద వెలిగిపోతోంది. ఎంతోమంది కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేస్తున్నా ఈ చందమామ హవా ఇంకా తగ్గలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటిస్తోంది. ఈ మధ్య పెళ్ళి కబుర్లు చెప్పిన అమ్మడు మరిన్ని సినిమాల్లో చేయాలని భావిస్తున్నట్లుంది. అందుకే తనలోని గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఈమధ్య హాట్ హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటోంది.

అయితే ఈ అమ్మడు ఫోటో షూట్లో రెచ్చిపోవడం కారణం ఏమై వుంటుందనుకుంటున్నార. ఒకవైపు ఫేస్ లో.. బాడీలో ఒకప్పటి గ్లో పోయిందన్న విమర్శలు.. మరోవైపు వరుస ఫ్లాపులు.. దీంతో కొన్ని నెలల కిందట కాజల్ అగర్వాల్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ ఎరుకే. డిమాండ్ తగ్గిన ఆ సమయంలోనే రానా లాంటి స్టార్ ఇమేజ్ లేని హీరోతో.. తేజ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో కాజల్ సినిమా కమిటయ్యేసరికి ఆమె కెరీర్ చరమాంకానికి వచ్చేసిందని.. కాజల్ ఇంకెన్నో రోజులు ఇండస్ట్రీలో కనిపించకపోవచ్చని అంచనాలు కట్టేశారు జనాలు. ఐతే అక్కడ కట్ చేసి.. వర్తమానంలోకి వస్తే కాజల్ డేట్ల కోసం నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి. ‘ఖైదీ నెంబర్ 150’తో కాజల్ మళ్లీ ఊపందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు మళ్లీ ఆమె వెంట పడుతున్నట్లు సమాచారం. కానీ వాళ్లందరికీ ‘ఇప్పుడు కుదరదు’ అనే సమాధానమే వస్తోంది కాజల్ నుంచి.

రానా-తేజ సినిమాకు తోడు.. తమిళంలో అజిత్ సరసన ‘వివేగం’.. ఇంకో సినిమా కూడా చేస్తోంది కాజల్. ఇంకో ఏడాది వరకు ఆమె డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని నెలల ముందు వరకు ఆమె అవకాశాల కోసం చూస్తుంటే.. ఇప్పుడు ఆమె కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. మూడేళ్ల ముందు కూడా.. కాజల్ పనైపోయినట్లుగా మాట్లాడుకున్నారు. కానీ మళ్లీ ఆమె రైజ్ అయింది. వరుసగా అవకాశాలందుకుంది. కానీ ఆ అవకాశాలేవీ కూడా ఆమెకు అంతమంచి ఫలితాలనివ్వలేదు. తెలుగు.. తమిళం.. హిందీలో కలిపి వరుసగా అరడజను ఫ్లాపుల తర్వాత ఆమెకు ‘ఖైదీ నెంబర్ 150’ రూపంలో బ్లాక్ బస్టర్ రావడం విశేషం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *