షాకింగ్: పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే

హైదరాబాద్: ‘కాట‌మ‌రాయుడు’ సినిమా త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమాలో న‌టించ‌నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘దేవుడే దిగి వ‌చ్చినా’ అనే టైటిల్ సైతం ప్రచారంలో ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పుడో హాట్ న్యూస్ చెప్పబోతున్నాం. మీరు విని ఆశ్చర్యపోయే న్యూస్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఆ అనుబంధంతో వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు.

ఇక అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా చేసిన బొమన్ ఇరానీ నిసైతం ఈ సినిమా కోసం తీసుకున్నారు. కుష్బు మరో కీ రోల్ లో కనిపించనుంది. జనవరి 2017 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా చేయనున్నారు.

పవన్ కళ్యాణ్..పిభ్రవరి నుంచి సెట్స్ కు వస్తారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవీందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15 , 2017న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అటు రాజ‌కీయాల‌తో పాటు ఇటు సినిమాల‌తోను బిజీ బిజీగా ఉంటున్నాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం గోపాల‌…గోపాల ఫేం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తారు. ప‌వ‌న్‌కు త్రివిక్ర‌మ్ ఇచ్చిన అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌లేదు. మ‌రి త్రివిక్ర‌మ్ సినిమాతో అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టి ప‌వ‌న్ త‌న అభిమానుల ఆక‌లిని తీరుస్తాడేమో చూడాలి. ఈ సినిమా కంప్లీట్ డీటైల్స్ త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *