పెళ్లంటే భయపడి పారిపోను అంటున్న బాలీవుడ్‌ భామ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె స్వభావంతో బీ టౌన్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడని కంగనా… ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ లాంటి సినిమాలతో టాప్‌ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. తనదైన నటనతో జాతీయ అవార్డును సైతం గెల్చుకున్న ఈ ఉంగరాల జుట్టు చిన్నది ప్రస్తుతం రాణి లక్ష్మీభాయ్‌ అనే చారిత్రాత్మక సినిమాలో నటిస్తోంది.

అయితే తాజాగా పెళ్లిగురించి మాట్లాడిన బాలీవుడ్ సొగసరి కంగనా రనౌత్…పెళ్లి ప్రతి ఒక్కరికి అవసరమని చెబుతున్నది. మనసుకు నచ్చిన వాడు ఎదురైతే తాను తప్పకుండా పెళ్లి చేసుకొని తీరుతానని అంటున్నది. ప్రేమపెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానికి ఇంకా సమయముందని చెప్పింది. హృతిక్‌రోషన్‌తో విఫలప్రేమాయణం నుంచి బయటపడిన ఆమె ప్రస్తుతం కెరీర్‌పైన దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా కంగనారనౌత్ మాట్లాడుతూ నా జీవితం ఓ తెరచిన పుస్తకం లాంటింది. వ్యక్తిగతజీవితం,సినిమాలు,ప్రేమకు సంబంధించిన ఏరహస్యాన్నైనా దాచడం నాకు ఇష్టం ఉండదు. దాచాలని ప్రయత్నించినా ఏదీ దాగదు అంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రతిసారి నా మనసులో ఉన్న మాటల్ని దాచుకోకుండా నిర్మొహమాటంగా మాట్లడతాను…అలాగే పెళ్లి చేసుకొనే సమయం వచ్చినప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటా…రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెబుతుంది ఈ బాలీవుడ్‌ బ్యూటీ. అంతేకాకుండా నా మనసుకు నచ్చిన వాడు దొరికితే వాడ్ని ఒప్పించే పెళ్లాడతాను…అంతేకాని పెళ్లంటే భయపడి పారిపోను అని చెబుతుంది ఈ బాలీవుడ్‌ భామ.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *