రివ్యూ: కథలో రాజకుమారి

కథ:
అర్జున్‌(నారా రోహిత్) పెద్ద స్టార్‌. గర్వం, అహంకారం ఎక్కువ. పక్క వాళ్లని సాటి మనిషిలా కూడా చూడడు. సినిమాల్లో విలన్‌గా నటిస్తుంటాడు. యాబై సినిమాలు చేసి ఐదు ఫిలింఫేర్ అవార్డులందుకుంటాడు. సినిమాలోనే కాదు.. భయట కూడా విలన్‌లాగే ప్రవర్తిస్తుంటాడు. అలాంటి మనిషి ఓ సంఘటన కారణంగా మారిపోతాడు. ఎంతలా అంటే గర్వం, కోపం పోయి… సినిమాల్లో కూడా కోపాన్ని చూపించలేకపోతాడు. ఆ కారణంగా సినిమాల్లో విలన్‌ పాత్రకు న్యాయం చేయలేక సతమతమౌతుంటాడు. తనలోని నటుడిని మళ్లీ బయటకు తీసుకురావడానికి ఏం చేయాలని చాలా మందిని సలహా అడుగుతాడు. ఈ క్రమంలో అర్జున్‌ ఓ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. ‘నీ జీవితంలో నీ శత్రువు ఎవరో గుర్తించు. వారి జీవితంలోకి వెళ్లు. వాళ్ల ఆనందాలను వారి నుంచి దూరం చెయ్‌! అప్పుడు నీలో ఉన్న క్రూరత్వం బయటకు వస్తుంది. అప్పుడు మళ్లీ నటుడిగా రాణిస్తావ్‌’ అని ఆ వ్యక్తి సలహా ఇస్తాడు. దాంతో తన జీవితంలో విలన్‌.. చిన్ననాటి స్నేహితురాలు సీత(నమితా ప్రమోద్‌) అని గుర్తించి, ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. మరి సీత దగ్గరకు వెళ్లిన అర్జున్‌ ఏం చేశాడు? ఆ అమ్మాయిని కలిశాడా? లేడా? అసలు అర్జున్‌కు సీత చేసిన ద్రోహం ఏంటి? నటుడిగా మళ్లీ బతికాడా? లేదా అన్నదే ‘కథలో రాజకుమారి’

ప్లస్‌ పాయింట్స్‌:
ఒక నటుడు తన నటన కోసం.. పాత్ర కోసం.. తన జీవితాన్ని మార్చుకోవటానికి చేసే ప్రయాణమే ఈ చిత్రం. కథ చాలా కొత్తగా అనిపిస్తుందీ. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రారంభం సన్నివేశాలను దర్శకుడు ఆసక్తిగా తీర్చిదిద్దిన దర్శకుడు.. కథను తెరపై సమర్థంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. నారా రోహిత్, నమిత లవ్ ట్రాక్ చాలా బాగా తెరకు ఎక్కించారు. నారా రోహిత్‌ రెండు రకాల విభిన్న పాత్రలను సమర్థంగా పోషించాడు. ప్రతినాయకుడిగా కనిపించిన సన్నివేశాలు బాగుంటాయి. నాగ శౌర్య ఉండేది కొద్దీసేపే అయినా పాత్రకు న్యాయం చేసాడు. ఈ కథకు కీలక పాత్ర కథానాయికది. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. నమితాప్రమోద్‌ ఈ పాత్రలో పర్వాలేదనిపించిది.అవసరాల శ్రీనివాస్‌, తనికెళ్ల భరణి, అజయ్‌, ప్రభాస్‌శ్రీను తమ పాత్రల పరిధిమేర రాణించారు.

మైనస్ పాయింట్స్‌:
టెక్నికల్‌గా ఒక అమ్మాయిపై కథానాయకుడు పగ తీర్చుకోవడం అనేది ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. అటు సినిమాలో.. ఇటు జీవితంలో చెడ్డవాడిగా ఉన్న అర్జున్‌ మంచివాడిగా మారడానికి పెద్ద కారణాలు కనిపించవు. సీతతో ఫ్లాష్‌బ్యాక్‌.. చిన్ననాటి సంఘటనలు, ఆమెపై కోపం రావడానికి గల కారణాలు ఇంకాస్త ప్రభావవంతంగా తీర్చిదిద్దాల్సింది.ప్రేక్షకుడు సెకండాఫ్‌ను ముందే వూహించగలడు. కథలో మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే నెమ్మదిగా ఉండటం, ప్రేక్షకుడిని కాస్త నిరాశకు గురి చేస్తాయి. వినోదానికి కొంచె చోటిస్తే బాగుండేది. క్లైమాక్స్‌ను ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది.

సాంకేతిక విభాగం:
కథ బాగున్నా, ఇంకాస్త సమర్థంగా చూపించడానికి అవకాశం ఉంది. డైలాగ్‌లు అక్కడక్కడా ఆకట్టుకుంటాయి. ఇళయరాజా ఇచ్చిన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నాయకనాయికలు చిన్నప్పటి సన్నివేశాలను అందంగా చూపించారు. నరేష్ కే రానా సినీమాటోగ్రఫీ చాలా బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విడుదల తేదీ: 15/09/2017
రేటింగ్ : 2. 5/5
న‌టీన‌టులుః నారా రోహిత్,. నమితా ప్రమోద్‌, నాగశౌర్య
సంగీతం : ఇళయరాజా.. విశాల్‌ చంద్రశేఖర్‌
నిర్మాతలు: కృష్ణ విజయ్, ప్రశాంతి, సౌందర్య నర్రా
ద‌ర్శ‌క‌త్వం : మహేష్‌ సూరపనేని

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *