రేవంత్ ఇంటికి భోజ‌నానికి కేసీఆర్‌

ఈ హెడ్డింగ్ చూస్తే చాలా మంది షాక్ అవుతారు. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌పై ఒంటికాలితో విరుచుకుప‌డే వాళ్ల‌లో రేవంత్‌రెడ్డికి ఫ‌స్ట్ ర్యాంక్ ఇచ్చేయాలి. రేవంత్ కేసీఆర్‌ను ప‌దే ప‌దే త‌న పంచ్ డైలాగ్స్‌తో విమ‌ర్శిస్తుంటారు. ఇక కేసీఆర్ కూడా ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను ప‌క్కా ప్లానింగ్‌తోనే ఇరికించార‌న్న చ‌ర్చ కూడా ఉంది. ఏదేమైనా వీరిద్ద‌రు చాలా బ‌ద్ధ శ‌త్రువులు. వీరి మ‌ధ్య నీళ్లు పోసినా పెట్రోల్‌లా మండిపోతుంది.

మ‌రి అలాంటిది రేవంత్ ఇంటికి కేసీఆర్ వెళ్లి భోజ‌నం చేయ‌డం ఏంట‌బ్బా అన్న డౌట్లు చాలా మందికి వ‌స్తాయి. ఇటీవ‌ల కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో సీఎంలు ప్రతిపక్ష నేతల ఇళ్లకు భోజనానికి వెళ్లేవారని.. ఇప్పుడు మళ్లీ ఆ సంప్రదాయం కొనసాగిద్దామని అన్నారు.

తాను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయ‌న పెట్టిన పులుసో..ప‌ప్పో తిని వ‌స్తాన‌ని అన్నారు. కేసీఆర్ జానాను బుట్ట‌లో వేసుకునేందుకు ఈ డైలాగ్స్ పేల్చినా…. వీటిపై కౌంట‌ర్లు స్టార్ట్ అయ్యాయి. కేసీఆర్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే సాహ‌సం చేయ‌లేర‌ని జానారెడ్డి అన్నారు. ఇక ఈ ప్ర‌స్తావ‌న రేవంత్‌రెడ్డి వ‌ద్ద వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్‌ను విందుకు పిలిస్తే న‌క్క – బాతు సామెత‌లా ఉంటుంద‌ని సెటైర్ వేశారు.

మరి సీఎం తాను చెప్పిన సంప్రదాయం పాటిస్తే.. జానారెడ్డితో పాటు బీజేపీ ప‌క్ష‌నేత కిష‌న్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఇళ్ల‌కు వెళ్ల‌డానికి ఇబ్బంది ఉండ‌క‌వ‌పోచ్చు. మ‌రి టీడీపీ ప‌క్ష నేత రేవంత్ రెడ్డి ఇంటికి వెళ‌తారా..? అని ప్ర‌శ్నించుకుంటే క‌ష్ట‌మే అన్న ఆన్స‌రే తెలంగాణ పాలిటిక్స్‌లో ఎక్కువుగా వినిపిస్తోంది. కేసీఆర్ పెట్టిన ఈ ప్రతిపాదన రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకుల్లో చర్చనీయాంశమైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *