యదాద్రి వివాదం: కే‌సి‌ఆర్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ఫైర్

యాదాద్రి పునఃనిర్మాణంలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న ఆలయ స్తంబలపై కే‌సి‌ఆర్,టి‌ఆర్‌ఎస్ పార్టీ గుర్తు, ప్రభుత్వ పథకాల చిహ్నాలు చెక్కడంపై పెద్ద దుమారమే రేగుతుంది. ఈ విషయమై ఇప్పటికే ప్రతిపక్షాలు టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.ఇప్పుడు ఈ విషయంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. పవిత్ర పుణ్యక్షేత్రాల స్తంభాలపై కే‌సి‌ఆర్,టి‌ఆర్‌ఎస్ పార్టీ గుర్తు, ప్రభుత్వ పథకాల చిహ్నాలు చెక్కడన్ని తీవ్రంగా ఖండించింది. వెంటనే కే‌సి‌ఆర్ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అభ్యంతరంగా ఉన్న స్తంభాలను తొలగించాలని సూచించింది. దీనిపై యదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ స్పందించి సమకాలీన పరిస్తితులను, సంస్కృతి గురించి భవిష్యత్ తరాలకి తెలియజేయడానికే శిల్పాలు చెక్కరని వివాదాన్ని చల్లర్చే ప్రయత్నం చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే శిల్పాలు చెక్కించారనడం పూర్తిగా అవాస్తవమని కిషన్ రావు తెలిపారు. ఫలానా చిత్రాలే చెక్కాలని శిల్పులకు ఎవరూ చెప్పరని తెలిపారు. ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కావని స్పష్టం చేశారు. కేసీఆర్ బొమ్మను శిల్పి ఇష్టం మేరకే చెక్కినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *