ఫాంహౌజ్‌కు వెళ్తూ..: కారు ఆపి మరీ.. కేసీఆర్

ఫాంహౌజ్ రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పదునైన వ్యాఖ్యలతో కేసీఆర్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఎంజాయ్ చేయాలనుకుంటే.. హైదరాబాద్ లోనే ఎన్నో గెస్ట్ హౌజ్‌లు ఉన్నాయని, అక్కడిదాకా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఫామ్ హౌజ్ అంటే తనకు ఇల్లు లాంటిదని అందుకే తరుచూ అక్కడికి వెళ్లి వస్తుంటానని బుధవారం ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ప్రెస్‌మీట్ పెట్టిన మరుసటి రోజే ఆయన ఫామ్‌హౌజ్ బాట పట్టారు. వెళ్తూ.. వెళ్తూ.. మధ్యలో తన కారు ఆపి మరీ.. జనంతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు, అధికారుల పనితీరు, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనుకోకుండా సీఎం తమ వద్దకు రావడంతో.. అక్కడి ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

కేసీఆర్ కాన్వాయ్ ను చూసేందుకు రోడ్ల మీదకు వచ్చిన గ్రామస్తులకు షాకిస్తూ.. ఆయన రోడ్డు మీద తన కారును ఆపించారు. కారులో నుంచి దిగిన కేసీఆర్ ప్రజల వద్దకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మిషన్ భగీరథ గురించి అడిగారు. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన కేశవరం గ్రామస్తులు ఒక అడుగు ముందుకేసి.. తమ గ్రామాన్ని ముఖ్యమంత్రి దత్తత తీసుకోవాలని కోరారు. అయితే.. ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఎక్కువ నిధులు ఇచ్చి సమస్యల్ని తీరుస్తానన్నారు.

పేకాట పూర్తిగా పోయిందా? అంటూ మహిళల్ని ప్రత్యేకంగా అడిగిన కేసీఆర్.. కరెంటు సరఫరా ఎలా ఉంది? రఐతులకు 24 గంటల కరెంటు ఇస్తే ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నల్ని అడిగారు. అయితే.. రైతులకు 15 గంటలు నాన్ స్టాప్ గా కరెంటు ఇస్తే సరిపోతుందని.. ఇరవైనాలుగు గంటలూ అక్కర్లేదని రైతులు చెప్పటం గమనార్హం.

రైతులకు 15గం. నిరంతరాయ విద్యుత్ ఇస్తే బాగుంటుందని, 24గం. అయితే మోటార్లు కాలిపోతాయని అక్కడి ప్రజలు సీఎంకు బదులివ్వడం గమనార్హం. సీఎం రాకపై హర్షం వ్యక్తం చేసిన అక్కడి ప్రజలు.. తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కూడా కోరారు. అయితే సీఎం మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దానికి బదులు ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ది జరిగేలా చేస్తామని హామి ఇచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *