కేజ్రీవాల్‌, భార్య సునీత వీరిది ప్రేమ వివాహం

న్యూఢిల్లీ :     కేజ్రీవాల్‌, భార్య సునీత వీరిది ప్రేమ వివాహం.  ఇద్దరూ సివిల్స్‌ పరీక్ష రాసి ఐఆర్‌ఎస్‌ కు ఎంపికై నాగ్‌పూర్‌లోని ఐఆర్‌ఎస్‌ అకాడమీలో శిక్షణ కోసం వచ్చారు. కేజ్రీ వాల్‌ నిజాయితీ, దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఆమెను ఆకట్టుకొన్నాయి. ఆమె తెలివితేటలు, వ్యక్తిత్వం చూసి  కేజ్రీవాల్‌ ఆమెను ప్రేమించారు. కేజ్రీ కుటుంబం హరియాణాలోని హిస్సార్‌లో ఉండేది. సునీత కుటుంబం అప్పటికే ఢిల్లీలో స్థిరపడింది. కేజ్రీ వాల్‌, సునీత పెళ్లికి తొలుత వారి పెద్దలు ఒప్పుకోలేదు. తర్వాత సమ్మతి తెలిపారు. 1994 నవంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వీరికి కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్‌ ఉన్నారు.  కేజ్రీవాల్‌ భార్య సునీత సంతోషంతన పుట్టిన రోజున ఢిల్లీ ప్రజలు అందించిన విజయం కంటే పెద్ద బహుమతి ఏం ఉంటుందని కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన ఆమె ఎన్నికల్లో చురుగ్గా పనిచేశారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *