బాహుబలికి.. ఒక్కొక్కళ్లూ ఎంత తీసుకున్నారో తెలుసా??

బాహుబలి ద కన్ క్లూజన్ సినిమా విడుదలైంది. ఘన విజయం కూడా సాధించింది. రికార్డులు, వసూళ్లు కూడా కొల్లగొడుతోంది. ఈ విషయం పాతదే అయినా.. బాహుబలి ద కన్ క్లూజన్ ను సంబంధించిన ఓ విషయం ఇప్పుడు.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా ఐదేళ్ల పాటు.. ఈ సినిమా కోసం డేట్లు కేటాయించి వారంతా.. కోట్ల మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ లెక్కలేంటో ఓ సారి చూద్దాం.

బాహుబలి గా లీడ్ రోల్ చేసిన ప్రభాస్ ఏకంగా.. 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడట.

భల్లాలదేవగా బాహుబలి ప్రత్యర్థి క్యారెక్టర్ చేసిన రానాకు.. 15 కోట్ల రూపాయలు ముట్టాయట.

దేవసేనగా అద్భుతంగా నటించిన అనుష్కకు 5 కోట్ల రూపాయలు.. అవంతికగా అందాలు ఆరబోసిన తమన్నాకు 5 కోట్ల రూపాయలు.. రెమ్యూనరేషన్ అందిందట.

సినిమాకు కీలకమైన కేరెక్టర్లు… రాజమాత శివగామీ దేవిగా నటించిన రమ్యకృష్ణకు 2న్నర కోట్ల రూపాయలు.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిన కట్టప్ప సత్యరాజ్ కు 2 కోట్ల రూపాయలు.. పారితోషికం ముట్టినట్టు తెలుస్తోంది.

ఇక.. బాహుబలి వన్, బాహుబలి ద కన్ క్లూజన్ సినిమాలను ప్రాణం పెట్టి మరీ తీసిన ఎస్ఎస్ రాజమౌళి.. ఈ సినిమాకు దాదాపు అంతా కలిపి వంద కోట్ల రూపాయలు అందుకున్నాడనీ ప్రచారం జరుగుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *