విషయం తెలిసి ఏడుస్తున్న రేపిస్టులు

బీహార్‌లోని కైమూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో ఉండటంతో సోమవారం గయాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. రాత్రివేళ ఇంటికి తిరిగెళ్లేందుకు పాట్నా-బభువా ఇంటర్ సిటీ రైలు ఎక్కింది. బోగీలో ప్రయాణికులు తక్కువగా ఉండటంతో బిక్కుబిక్కుమంటూ ఓ మూలన కూర్చుంది. ఆమె ఒంటరిగా రైలెక్కడాన్ని గమనించిన నలుగురు యువకులు అదే బోగీలోకి ఎక్కారు. అర్ధరాత్రి వేళ ఆమెను నోరునొక్కి ఓ మూలకు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు పెట్టుకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ కామాంధుల పశువాంఛ కారణంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. రాత్రి సమయంలో ఓ స్టేషన్‌లో ఆగిన రైలును చెక్ చేస్తున్న పోలీసులకు బోగీ తలుపులు వేసి ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు గట్టిగా తలుపులు బాదారు. ఆ సమయంలో అత్యాచారం చేసిన నిందితులు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో వారిని వెంబడించిన పోలీసులు ఓ నిందితుడినిపట్టుకున్నారు.బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా కాసేపటికి తేరుకుంది. దీంతో పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసకున్నారు. తన భర్త ఎయిడ్స్ కారణంగా చనిపోయాడని, అతడి నుంచి ఆ వ్యాధి తనకు వ్యాపించిందని బాధితురాలు తెలిపింది. అత్యాచారం చేస్తున్న సమయంలో తనకు ఎయిడ్స్ ఉందని మొత్తుకున్నా కామాంధులు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము అత్యాచారం చేసింది ఎయిడ్స్ రోగినని తెలియడంతో పోలీసులకు పట్టుబడిన నిందితుడికి తెలియడంతో అతడు లబోదిబోమంటున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *