అర్జున్‌ రెడ్డి ఇరగదీశాడు:కేటీఆర్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అర్జున్ రెడ్డి అనే చిత్రం తెర‌కెక్క‌గా ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. విడుద‌ల‌కి ముందు అనేక వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టు ముట్టిన‌, చివ‌రికి మంచి విజ‌యం సాధించింది. వీకెండ్ లో హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఈ చిత్రం చేరడం ఖాయ‌మ‌ని అంటున్నారు.

తాజాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఇరగదీశాడంటూ కితాబిచ్చారు. దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. నిజాయతీని ప్రతిబింబించే, మనసును హత్తుకునే సినిమా ఇది అని చెప్పారు. ఇలాంటి రిస్కీ సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని తెలిపారు.

ప్రేక్షకుల అంచనాలు వందకు వందశాతం అందుకున్న ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తొలి రోజు రూ. 4 కోట్లు వసూలు చేసింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు ఉన్న క్రేజ్, కలెక్షన్ల జోరు చూస్తుంటే ఓవరాల్ రన్‌లో రూ. 20 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *