ఎక్స్ క్లూజివ్ : ఇన్ సైడ్ టాక్ “లై”

ఆగ‌స్ట్ 11న ఏకంగా మూడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డుతుండ‌టంతో, ఎవ‌రికి వారు ప్ర‌చారాన్ని ఓ రేంజ్ లో చేస్తున్నారు. అయితే ఈ రేసులో మిగ‌తావాటి కంటే లై కాస్త ముందంజ‌లో ఉంది. ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్న నితిన్ కి వ‌రుస హిట్లు ప‌డ‌టం, అఆ త‌రువాత రిలీజ్ అవుతున్న సినిమా కావ‌డంతో లై ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. తాజాగా లై సెన్సార్ టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. యు ఏ రేటింగ్ తో విడుద‌ల కాబోతున్న ఈ సినిమాలో నితిన్ క్యారెక్ట‌ర్ వినూత్న‌నంగా ఉండ‌బోతుంద‌ని తెలిసింది.

ఏ. స‌త్యం అనే పాత్ర‌లో నితిన్ క‌నిపిస్తున్నాడు. సినిమా యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో ఓపెన్ అవుతుంద‌ట‌, ఈ సినిమాలో ప‌ద్మ‌నాభం అనే పాత్ర పోషిస్తున్నాడ‌ట అర్జున్. స‌త్యం, అర్జున్ ఇద్ద‌రు ఎదురుప‌డే సీన్లు ఆక్టుకుంటాయ‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా ఆకాష్, చైత్ర అనే క్యారెక్ట‌ర్ లో న‌టిస్తుంది. ఆమె పాత్ర కూడా మెప్పిస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు తెలిపాయి. ఓ ప్యాకెట్ చుట్టూ సాగే ఓ థ్రిల్ల‌ర్ గా డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌పూడి లై ని రెడీ చేశాడ‌ట‌. ఇక ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ పాయింట్స్ విష‌యానికొస్తే, నితిన్ క్యారెక్ట‌ర్, అర్జున్ యాక్ష‌న్, ర‌వికిష‌న్ పాత్ర చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే, ఫ‌స్ట్ హాఫ్ లో వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు.

ఇక నెగిటివ్స్ విష‌యానికొస్తే ఆడియెన్స్ ను క‌థ‌లోకి ఇన్వాల్వ్ అవ్వ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ట‌, కాస్త స్లో నెరేష‌న్ ఉంద‌ని, సెకండాఫ్ కాస్త ఎంట‌ర్ టైన్ మెంట్ తగ్గింద‌ని, ఈ సినిమాలో హీరో, విల‌న్ మ‌ధ్య న‌డిచే మైండ్ గైమ్ ఆడియెన్స్ ను కాస్త క‌న్ఫ్యూజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మొత్తంగా లై లో ఓ కొత్త నితిన్ ని చూడ‌టం ఖాయం అనే టాక్స్ ప్ర‌స్తుతం వినిపిస్తుంది. మరి ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *