మధ్య ప్రదేశ్ సెక్స్ స్కాండల్…మాజీ సిఎం, గవర్నర్

మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ స్కాండల్ బయటపడింది. దాదాపు 40 మంది కాల్ గర్ల్స్‌ తో రాజకీయ నాయకులు, అధికారులకు వల వేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వలపు వల వేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు గుర్తించి, వారివద్ద 92 హై క్వాలిటీ వీడియోలను, రెండు ల్యాప్‌టాప్‌లను, పలు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు మహిళల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

ఈ భారీ బ్లాక్‌మెయిల్ స్కాండల్.. శ్వేత స్వప్నిల్ జైన్ అనే మహిళ నేతృత్వంలో నడుస్తోందని తెలుసుకొని, ఆమెను అరెస్టు చేయడంతో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె.. బాలీవుడ్‌కు చెందిన బీ గ్రేడ్ నటీమణులతో పాటు, 40 మంది టాప్ క్లాస్ కాల్ గర్ల్స్‌ తో ఒక ముఠాను ఏర్పాటు చేసింది. వారితో రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు వల వేసి, వారికి దగ్గరయ్యేలా చేసేది. సెక్స్ అంటూ వారిని లొంగదీసుకొని తాను చెప్పిన గెస్ట్ హౌజ్ గానీ, ఫైవ్ స్టార్ హోటల్‌కు గానీ రావాలని వారికి చెప్పేది. ముందుగా ఏర్పాటు చేసిన మొబైల్ కెమెరా లేదా స్పై కెమెరాతో ఆ తతంగాన్ని వీడియో తీసి.. ఆ వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేయించేది. అలా మొత్తం 92 హై క్వాలిటీ వీడియోలను హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచిందామె. వాటితో రాజకీయ నాయకులను, అధికారులను బ్లాక్‌మెయిల్ చేయించి.. ఓ మాజీ సీఎం నుంచి విలాసవంతమైన బంగ్లాను కూడా దక్కించుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *