రాబ్తా కాపీ కొట్టటం కాదు అసలు మగధీరనే కాపీ: ఇది చదివితే బుర్ర తిరిగి పోద్ది

మగధీర మూవీ స్టోరీని కాపీ కొట్టేసి.. బాలీవుడ్ మూవీ ‘రాబ్తా’ను తెరకెక్కించారంటూ.. గీతా ఆర్ట్స్ తరఫున కోర్టులో కేసు దాఖలు చేయడం సెన్సేషన్ అయింది. ట్రైలర్ రిలీజ్ నుంచి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మగధీరకు కాపీ అనే అనుమానాలూ ఆరోపనలూ నడుస్తూనే ఉన్నాయి. అయితే గతం లో అసలు మగధీర కథే నా కథకు కాపీ అంటూ ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేసిన ప్రముఖ రచయిత ఎస్పీ చారీ ఇప్పుడు మళ్ళీ తెరమీదకి వచ్చారు…

చందేరీ ఈ కథనే కొద్ది మార్పులతో 1998 లో ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా వచ్చీన కథే చందేరీ ఈ కథనే కొద్ది మార్పులతో తెరకెక్కించారని ఎస్పీ చారీ ఆరోపించారు. అప్పట్లో ఆంధ్ర భూమిలో సీరియల్ గా వచ్చిన కథని చాలామందే చదివినా మగధీర సమయం లో పాపం చారీ గారికి సపోర్ట్ గా ఎవ్వరూ రాలేదు. అలా ఫిలిం చాంబర్ కూడా ఆయన ఫిర్యాదుని సీరియస్ గా పట్టించుకున్నవాళ్ళే లేరు.

400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి మధ్య ప్రదేశ్ లోని ఆర్చా రాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు బావిలో దూకి ఆత్యహత్య చేసుకుంటారు. 400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి వివాహం చేసుకుంటారు. తన నవలలో ప్రేమికుల పేర్లకి హరదాల్, ఇందుమతి అని పెట్టగా సినిమాలో వాటిని మార్చి హర్ష, ఇందుగా పెట్టారని ఎస్ పి చారి వాదన.

magadheera-copied-from-sp-chary-s-chanderi
magadheera-copied-from-sp-chary-s-chanderi

మిగతా అంతా సేమ్ ఇక నవలలో విలన్ హీరోకి సోదరుడు కాగా, సినిమాలో హీరోయిన్ కి బావగా చూపించారు, ఇదీ తప్ప మిగతా అంతా సేమ్ అంటూ రచయిత ఆరోపిస్తున్నాడు. అయితే ఇది ఆరోపన కాదు నిజంగా చందేరీ నవలని చదివితే అసలు విషయం అర్థమైపోతుంది. ఎమ్మెస్కో బుక్ స్టోర్స్ లో ఈ పుస్తకం దొరకవచ్చు.

కాంటెస్ట్ ని కూడా నిర్వహించారు 98 లో ఈ నవల సీరియల్ గా వచ్చినప్పుడు నవల లోని ఏడు రహస్యాలని కనుగొనమంటూ ఆ పత్రిక వారు ఒక కాంటెస్ట్ ని కూడా నిర్వహించారు. అయితే ఇది కాకతాళీయం కూడా కావచ్చు అనే వాదనాలేకపోలేదు. ఇటీవల ఈ చిత్రాన్ని బాలీవుడ్ మూవీ రాబ్తా యూనిట్ కాపీ కొట్టిందని, ఈ క్రమంలో నిర్మాణ సంస్థ కోర్టు మెట్లెక్కింద‌ని వార్తలు వచ్చాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *