స్పైడర్ ఎంత తెస్తే హిట్టో తెలుసా?

మహేష్ బాబు మూవీ స్పైడర్ థియేటర్లలోకి వచ్చేందుకు ఇంకొన్ని గంటల సమయమే ఉంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలు స్పైడర్ ఫీవర్ తో అట్టుడికిపోతున్నాయి. మరోవైపు ఇవాళ సాయంత్రం నుంచి యూఎస్ లో ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. రికార్డ్ లెవెల్లో ప్రీమియర్స్ వేస్తుండడంతో.. రిలీజ్ కి ముందు రోజే 1 మిలియన్ డాలర్స్ వస్తాయని అంచనాలున్నాయి.

స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన తీరు.. టాలీవుడ్ మేకర్స్ ను మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఒక్క బాహుబలి సిరీస్ ని మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో బిజినెస్ చేయడం ఇదే ప్రథమం. నైజాంలో స్పైడర్ ప్రీరిలీజ్ బిజినెస్ 24 కోట్లు పలికితే.. సీడెడ్ 12 కోట్లు.. వైజాగ్ 8.1 కోట్లకు విక్రయించారు. ఈస్ట్ 6 కోట్లు.. వెస్ట్ 4.5  కోట్లు.. కృష్ణా 5.4  కోట్లు గుంటూరు 7.2  కోట్లు.. నెల్లూరు 3.2  కోట్లు స్పైడర్ రైట్స్ పలికాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 70.4 కోట్ల వ్యాపారం చేస్తే.. కర్నాటక 10.8  కోట్లు.. తమిళనాడు 18 కోట్లు.. కేరళ 1.3 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా 1 కోటి.. యూఎస్ 15.5 కోట్లు.. రెస్టాఫ్ ది వల్డ్ 7 కోట్ల వ్యాపారం చేసింది.

వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 124 కోట్లు కాగా.. తెలుగు+హిందీ శాటిలైట్ రైట్స్ 25 కోట్లు. తమిళ్+మలయాళం శాటిలైట్ 6.5  కోట్లు పలికాయి. ఆడియో హక్కుల రూపంలో 1.5 కోట్లు వచ్చాయి. అంటే స్పైడర్ ప్రీ రిలీజ్  బిజినెస్ వాల్యూ 157 కోట్లు అన్నమాట. అంటే ఈ చిత్రం సక్సెస్ కేటగిరీలో చేర్చాలంటే థియేటర్ల నుంచి 124 కోట్లు.. ప్లస్ ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు మరో 10 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంటుంది. స్పైడర్ సక్సెస్ జోన్ లోకి ఎంటర్ అవాలంటే.. అక్షరాలా నాన్ బాహుబలి రికార్డులను అన్నిటినీ బద్దలు కొట్టేయాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *