మహేశ్ డబ్బులు తీసుకొని ట్వీట్ చేశాడా?

సోషల్ మీడియా పుణ్యమా అని చిత్ర విచిత్రమైన వాదనలు.. ప్రచారాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. లాజిక్ ఏమాత్రం ఉండని ఈ తరహా ట్వీట్స్ కారణంగా అనవసరమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి వార్త ఒకటి యమా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. ఈ వారం విడుదలయ్యే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్కు సంబంధించి ప్రిన్స్ మహేశ్ బాబు చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

లెజెండ్.. సూపర్ హీరో.. మాస్టర్ బ్లాస్టర్.. ఇలా ఎన్నో పేర్లున్న ఒక్కక మనిషి.. సచిన్.. ఎ బిలియన్ డ్రీమ్స్. ఈ సినిమా కోసం వెయిట్ చేయలేకుండా ఉండలేకపోతున్నా. ఆల్ ద బెస్ట్ సచిన్  అంటూ ట్వీట్ చేయటం దానికి సచిన్ స్పందించిన నేపథ్యంలో.. ఇదంతా సినిమా కోసం సాగుతున్న ప్రమోషనల్ వర్క్ అన్న ప్రచారం షురూ అయ్యింది.

సచిన్ సినిమాకు హైప్ క్రియేట్ చేయటం కోసమే ఈ తరహా ట్వీట్ ప్రచారానికి తెర తీశారని.. ఇందులో భాగంగా మహేశ్కు భారీ మొత్తాన్ని అందజేసినట్లుగా వార్తలు మొదలయ్యాయి. ఇందులో నిజం అన్నది లేశ మాత్రం లేకున్నా.. వినేందుకు విచిత్రంగా.. ఆసక్తికరంగా ఉండటంతో ఈ ప్రచారం అంతకంతకూ జోరందుకుంది.

నిజానికి సచిన్ కున్న ఇమేజ్ కు.. మహేశ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా? అన్నది పెద్ద ప్రశ్న. అంతకు మించి.. సచిన్ అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు తన ఇంటర్వ్యూలలో మహేశ్ ప్రస్తావించటాన్ని మర్చిపోలేం.

తాను.. తన కుమారుడు ఎంతగానో అభిమానించే సచిన్ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఆల్ ద బెస్ట్ చెప్పే ఉద్దేశంతో ట్వీట్ చేస్తే.. లేనిపోని విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. ఈ ఇష్యూను పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసినట్లుగా  తెలుస్తోంది. నిజానికి సచిన్ తో తన కొడుకు కలిసిన చిత్రాన్ని గతంలో మహేశ్ సతీమణి నమత్ర పోస్ట్ చేయటం చూస్తేనే.. సచిన్ అంటే ఆ కుటుంబానికి ఎంత అభిమానమో. అయినా.. తీసుకోక తీసుకోక తాను ఎంతో అభిమానించే ప్రముఖుడి చిత్రానికి ప్రచారానికి చార్జ్ చేస్తారనుకోవటానికి మించిన అబద్ధం మరొకటి ఉండదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *