మ‌హేష్ భార్య‌పై మ‌లైకా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌పై బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌ను మోడ‌ల్‌గా ఉండే రోజుల్లో న‌మ‌త్ర త‌న‌తో చాలా దురుసుగా ప్ర‌వర్తించేద‌ని ఓ కార్యక్ర‌మంలో పాల్గొన్న మ‌లైకా చెప్పింది. బాలీవుడ్‌లోకి రాక‌ముందు మ‌లైకా మోడలింగ్ రంగంలో ప‌నిచేసింది. అప్ప‌టికే న‌మ్ర‌తా శిరోద్క‌ర్ టాప్ మోడ‌ల్‌. న‌మ్ర‌త‌తోపాటు మ‌రో మోడ‌ల్ మెహ‌ర్ జెస్సియా కూడా తమ సీనియారిటీ కార‌ణంగా త‌న‌తో పొగ‌రుగా ప్ర‌వ‌ర్తించేవారని మ‌లైకా తెలిపింది.
బాలీవుడ్ న‌టి నేహా ధూపియా నిర్విహించే `వోగ్ బీఎఫ్ఎఫ్‌` కార్యక్ర‌మానికి తాజాగా మ‌లైకా హాజ‌రైంది. ఆ సంద‌ర్భంగా మోడ‌లింగ్‌లో ఎదురైన అనుభ‌వాల గురించి చెప్ప‌మ‌ని మ‌లైకాను నేహా అడిగింది. దానికి స్పందిస్తూ.. `న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, మోహ‌ర్ జెస్సియా మోడ‌లింగ్ రంగంలో నాకు సీనియ‌ర్లు. అప్ప‌టికే వారు టాప్ మోడ‌ల్స్‌గా ఉన్నారు. దాంతో వారు జూనియ‌ర్‌నైన నాతో దురుసుగా ప్ర‌వ‌ర్తించేవారు. అయితే ఇప్పుడు వారిద్ద‌రితో నేను స్నేహం కొన‌సాగిస్తున్నాన‌`ని మ‌లైకా తెలిపింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *