వయసు 45-హాట్ నెస్ 25

మతులు పోగొట్టడానికి వయసుతో సంబంధం లేదు అనేలా ఉంటాయి కొందరు ఇచ్చే ఫోజులు చూస్తే. పైన మీరు చూస్తున్న ఫోటోకి ఈ ఉపమానం అచ్చంగా సరిపోతుంది. 90 పీరియడ్ లో క్రికెట్ మ్యాచులు – దూరదర్శన్ టీవీ చూసే వాళ్ళకు బాగా సుపరిచితురాలైన మందిరా బేడి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ సాహో సినిమాలో ఒక కీలక పాత్ర  పోషిస్తున్న మందిరా బేడి 45 ఏళ్ళ తన వయసును ఏ మాత్రం లెక్క చేయకుండా కైపెక్కే స్టిల్స్ ఇస్తూ అందరి దృష్టిని తన వైపు ఉండేలా మైంటైన్ చేస్తూ ఉంటుంది. క్లీవేజ్ ని స్పష్టంగా కనిపించేలా టాప్ యాంగిల్ లో తీసుకున్న ఈ పిక్ ని షేర్ చేసుకున్న మందిరా బేడి గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు అనే మెసేజ్ ని ఇవ్వకనే ఇస్తోంది. సాహో మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్న మందిరా బేడి సెట్ లో రెబెల్ స్టార్ నటనకు ఫ్యాన్ అయ్యానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే.

40 వయసు దాటాక కూడా మందిరా ఇలా రెచ్చిపోయి ఫోజులు ఇవ్వడం వెనుక ప్రత్యేక కారణం అంటూ ఏమి లేదు. కెరీర్ మొదట్లో శాంతి సీరియల్ లో డీసెంట్ రోల్ పోషించి అశేష అభిమానులు సంపాదించుకున్న మందిరా క్రికెట్ యాంకర్ గా మారిన తర్వాత పొట్టిగా జుత్తు కత్తిరించుకుని అప్పటి నుంచి తన స్టైల్ అండ్ లుక్ పూర్తిగా మార్చేసుకుంది. మూడు పదులు దాటగానే ఎక్స్ పైరి డేట్ అయిపోయినట్టు చూసే గ్లామర్ ప్రపంచంలో మందిరా లాగా మొహమాటపడకుండా ఉంటేనే అవకాశాలకు గేలం వెయ్యగలం. ఈ సూత్రాన్ని వంటబట్టించుకుంది కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఫాంలో ఉంది. సాహోలో మందిరా బేడి మాఫియా డాన్ తరహా పాత్ర పోషిస్తున్నట్టు టాక్ ఉంది. సాహో కోసమే ఈ మధ్య హైదరాబాద్ వస్తున్న మందిరా తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని హోప్స్ తో ఉంది .

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *