సినీ నటి అశ్రిత శెట్టితో మనీష్‌ పాండే వివాహం

సినీ నటి అశ్రిత శెట్టిని మనీష్‌ పాండే వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం సోమవారం ముంబైలోని ఒక హోటల్‌లో జరిగింది.  తమ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన మనీష్‌-అశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది .

ఐపీఎల్‌లో మనీష్‌ పాండే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని మనీష్‌ పాండే నేతృత్వంలోని కర్ణాటక జట్టు తాజాగా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు పరుగు తేడాతో తమిళనాడుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. మనీశ్‌ పాండే (45 బంతుల్లో 60 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక  ముంబైకి చెందిన అశ్రిత(26) 2012లో తుళు భాషలో నిర్మితమైన ‘తెళికెద బొల్లి’ద్వారా తెరంగేట్రం చేసింది. అనంతరం ఉదయం ఎన్‌హెచ్‌ 4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్‌ మూను కలవానికుళుమ్‌’, ‘ఇంద్రజిత్‌’ సినిమాల్లోనూ నటించింది. . ఇక అంతా మంచే జరగాలంటూ సన్‌రైజర్స్‌ పేర్కొంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *